
ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ మాదిరిగానే వారి భార్యలైన లక్ష్మీ ప్రణతి, ఉపాసన కూడా క్లోజ్ ఫ్రెండ్స్. తరచూ వీరు కలుస్తుంటారు. కుదిరినప్పుడల్లా గెట్ టు గెదర్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఇటీవల లండన్ లో సైతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీస్ సందడి చేశాయి. అది పక్కన పెడితే.. ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతిని ఉద్దేశించి ఉపాసన గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీ ప్రణతి గురించి ప్రశ్నించగా ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `ప్రణతి ఒక అద్భుతమైన అమ్మాయి. వయసు పరంగా ప్రణతి నాకంటే చిన్నదే.. అయినప్పటికీ ఏ విషయాన్ని అయినా ఆమె హ్యాండిల్ చేయగలదు. ప్రణతి స్వీట్ అండ్ సూపర్ స్ట్రాంగ్. ఆమెను చూసినప్పుడల్లా నాకు పీస్ ఫుల్ గా అనిపిస్తుంది. నిజంగా ప్రణతి లాంటి భార్యని పొందిన తారక్ చాలా లక్కీ` అంటూ ఉపాసన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు