టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి విభిన్నమైన పాత్రలతో సత్తా చాటారు. త్వరలో విజయ్ సేతుపతి నటించిన ఏస్ మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ సేతుపతి కెరీర్ తొలినాళ్ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
 
తాను యాక్టింగ్ వృత్తిగా ఎంచుకుని ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న సమయంలో వర్ణం అనే మూవీకి అడిషన్ కు వెళ్లగా నా డైలాగ్స్ నేనే రాసుకోవాలని రాసుకుని నటించమని సూచించారని విజయ్ వెల్లడించారు. నేను డైలాగ్స్ సైతం రాయగలనని అప్పుడే అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్ముగ కుమార్‌ టీమ్ కు నా పేరు సూచించారని విజయ్ సేతుపతి కామెంట్లు చేశారు.
 
96 సినిమాలో నేను హీరోగా నటించడానికి కూడా ఆర్ముగ కుమార్‌ కారణమని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. నన్ను అడిషన్ తీసుకోవాలని ఆయన సూచించడంతో అడిషన్ తీసుకున్నారని తెలిపారు. మనకు ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎవరైనా మనకు సాయం చేయడాని ముందుకు వస్తారని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. అయితే మనం ఎవరో తెలియనప్పుడు కూడా సహాయం చేయడం గొప్ప విషయమని వెల్లడించారు.
 
ఆ సాయం చిమ్మ చీకటితో నిండిన ఇంటిలో దీపం వెలిగించడం లాంటిదని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. విజయ్ సేతుపతి ఏస్ సినిమాకు ఆర్ముగ కుమార్ దర్శకుడు కావడం గమనార్హం. తనను నమ్మిన వ్యక్తికి ఈ స్థాయిలో సపోర్ట్ చేయడం కూడా జూనియర్ ఎన్టీఆర్ కే సాధ్యమని చెప్పవచ్చు. విజయ్ సేతుపతి భవిష్యత్తులో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విజయ్ సేతుపతి పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ సినిమాపై సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: