
సుజీత్ డైరెక్షన్ లో పవన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా పవన్ కెరీర్ లో 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా శ్రియా రెడ్డి ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
వాస్తవానికి దసరా కానుకగా అఖండ2 సెప్టెంబర్ 25వ తేదీకి షెడ్యూల్ అయింది. ఓజీ సినిమా రేసులో నిలిచిన నేపథ్యంలో బాలయ్య, పవన్ మధ్య బాక్సాఫీస్ వార్ ఉంటుందా? లేదా? అనే ప్రశ్నకు త్వరలో జవాబు దొరికే ఛాన్స్ ఉంటుంది. అఖండ2 మేకర్స్ ను సంప్రదించి ఓజీ మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించి ఉండవచ్చు. ఓజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.
ఆగష్టు నెలాఖరు నాటికి ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే ఛాన్స్ ఉంది. సాహో తర్వాత సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ సినిమా కోసం ఏకంగా 240 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలుస్తోంది. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల రిలీజ్ తో ఈ ఏడాది పవన్ ఫ్యాన్స్ కు మరింత స్పెషల్ గా మారుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.