హౌస్ ఫుల్ 5 సినిమా జూన్ 6వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే నాలుగు భాగాలను పూర్తి చేసి.. మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఐదో భాగంగా తెరపైకి రానున్న ఈ కామెడీ మూవీ మొదట నాలుగు భాగాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇటీవలే ముంబైలో ఈ మూవీ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ముందు భాగాలకు భిన్నంగా మరింత కామెడీగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీకి డైరెక్టర్ తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించారు.

ఈ మూవీని నానా పటేకర్, డినో మోరియా, సౌందర్య శర్మ, జానీ లివర్, నికితిన్ ధీర్, సోనం భాజ్వా, సంజయ్ దత్, కృతి సనన్, పూజా హెగ్డే, జాక్వలిన్ ఫిరమ్స్, జాన్ అబ్రహం నటించారు. హౌస్ ఫుల్ 5 సినిమా నిర్మాత సాజిద్ నదియాద్వాలా ఓ ఇంట్రెస్టింగ్ ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సాజిద్ మాట్లాడుతూ.. తను గత 30 సంవత్సరాలుగా ఆ ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. థియేటర్ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకులు చాలా కాలం వరకు మాట్లాడుకునేలా సినిమాను చేయాలని అనుకునేవారట. అలాంటి ఎక్స్ ఫాక్టర్ తో థ్రిల్లర్ ను ఎలా సృష్టించాలని ఆలోచించేవారట. అలా ఆలోచించి ప్రతి థియేటర్ లో వేరే కిల్లర్ ఉండే కథతో తను ముందుకు వచ్చాను అని తెలిపారు.


హౌస్ ఫుల్ 5 సినిమాను థియేటర్ లో చూస్తే ఒక హంతకుడు ఉంటాడని.. అలాగే గెలక్సీలో చూస్తే మరొకరు ఉంటారని తెలిపారు. పీవీఆర్ స్క్రీన్ నెంబర్ 4లో ప్రేక్షకులు వేరే అంతకుడిని చూస్తారని.. అదే సినిమాను పీవీఆర్ స్క్రీన్ నెంబర్ 5లో చూస్తే మరో హంతకుడు కనిపిస్తారని అన్నారు. హౌస్ ఫుల్ 5 సినిమా ప్రతిసారి ప్రేక్షకులకు వేరే ముగింపును చూపిస్తుందని నిర్మాత చెప్పుకొచ్చారు. ఇలా ట్విస్ట్ తో కూడిన సినిమాను భారతదేశానికి మొదటిసారి పరిచయం చేస్తున్నామని అన్నారు. సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు కూడా సగం మంది నటులకు ఈ ట్విస్ట్ తెలియదని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: