ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా కన్నప్ప సినిమా గురించి చర్చ జరుగుతోంది. కన్నప్ప హార్డ్ డిస్క్ కేసులో షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ హార్డ్ డిస్క్ చోరీ జరిగి దాదాపుగా మూడు నెలలు అయిందని తెలుస్తోంది. ఈ సినిమా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అనే సంగతి తెలిసిందే. మార్చి మొదటి వారంలో ముంబై కంపెనీ హార్డ్ డిస్క్ ను పంపగా రఘు అనే వ్యక్తి ఆ కొరియర్ ను తీసుకున్నారట.
 
అయితే రఘు మాత్రం తాను ఆ కొరియర్ ను తీసుకోలేదని చెబుతుండటం గమనార్హం. హార్డ్ డిస్క్ మిస్ కావడంతో నిర్మాత పోలీసులను సంప్రదించడం జరిగింది. ఇందులో కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ ఉన్నాయని నిర్మాత చెబుతున్నారు. ఈ హార్డ్ డిస్క్ మిస్ అయితే తమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని కామెంట్ చేస్తున్నారు.
 
కన్నప్ప హార్డ్ డిస్క్ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇందులో ప్రభాస్ కు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు సైతం ఉన్నాయని భోగట్టా. కన్నప్ప సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెలలో థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.
 
కన్నప్ప సినిమా ఇతర భాషల్లో సైతం విడుదల కానుండటం గమనార్హం. కన్నప్ప సినిమాలో ట్విస్టులు సైతం ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. కన్నప్ప సినిమా కోసం మంచు విష్ణు తన కెరీర్ ను పణంగా పెడుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కన్నప్ప ఫిర్యాదుకు సంబంధించి విచారణ జరుగుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. కన్నప్ప సినిమాలో ఇతర భాషలకు చెందిన కీలక నటులు నటించిన సంగతి తెలిసిందే. కన్నప్ప కమర్షియల్ గా ఏ రేంజ్ హిట్టవుతుందో చూడాల్సి ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: