చాలామంది సెలబ్రిటీలు ఇతర భాషలలో నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో హీరోగా, విలన్లుగా నటించి బాగానే పేరు సంపాదించారు. అలా పేరు సంపాదించిన వారిలో రాజేష్ కూడా ఒకరు. ఈయన హీరోగా తమిళ్, మలయాళం వంటి చిత్రాలలోనే నటించడమే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారు. అలా సుమారుగా 50 సంవత్సరాల వరకు నటించారట. తాజాగా రాజేష్ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈయన వయసు 75 సంవత్సరాలు. అయితే ఈ హీరో మృతికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ హీరో మరణ వార్త విని అటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. పలువురు సిని సెలెబ్రిటీలు  కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.



సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పాటు ప్రేక్షకులను అలరించిన హీరో రాజేష్.. హీరోగా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు అలా సుమారుగా 140 పైగా సినిమాలలో నటించారు.. ఇక తెలుగులో కూడా రాజేష్ నటించిన చిత్రాల విషయానికి వస్తే.. బంగారు చిలుక, మా ఇంటి మహారాజు తదితర చిత్రాలలో నటించారు. రాజేష్ ఎక్కువగా తమిళ ,మళయాలం సినిమాలలోనే నటించేవారు. రాజేష్ అటు బిజినెస్ వైపుగా కూడా హోటల్ రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలలో కూడా అడుగు పెట్టారట. రాజేష్ భార్య పేరు జోన్ సిల్వియా.. అయితే ఈమె కూడా 2012లో మరణించారు.


1985లో కేకే నగర్ సమీపంలో చెన్నైలో సినిమా షూటింగ్ కోసమే ప్రత్యేకించి ఒక బంగ్లాను కూడా నిర్మించిన మొట్టమొదటి నటుడుగా పేరు సంపాదించారు రాజేష్. ఇక అదే బంగ్లాలోనే ఎన్నో తమిళ, మలయాళం, హిందీ వంటి సినిమా షూటింగులు కూడా చేశారట. ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ఎంతోమంది సినీ సెలబ్రిటీలతో స్నేహపూర్వకంగా ఉండేవారు. మరి హీరో రాజేష్ మరణ వార్త పైన కుటుంబ సభ్యులు ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: