
అయితే సడన్గా సినిమాలో హీరోయిన్గా గ్లోబల్ బ్యూటీ దీపిక పదుకొనే అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . వెంటనే 20 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుంది అంటూ ఈ సినిమా నుంచి సందీప్ రెడ్డి ఆమెను తీసేసాడు అన్న న్యూస్ ట్రెండ్ అయింది . అయితే ఒకే ఒక్క ట్విట్ తో సోషల్ మీడియాని షేక్ చేసేసాడు సందీప్ రెడ్డి వంగ . స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కి హీరోయిన్గా "తృప్తి దిమ్రి" నటిస్తుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . ఇక అప్పుడు మొదలైన లొల్లి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది . దీపికా పదుకొనే తన పిఆర్ టీంతో ఈ స్టోరీని మొత్తం లీక్ చేయించేసింది అంటూ రకరకాల వార్తలు వినిపించాయి . దానికి తగ్గట్టే కౌంటర్స్ కూడా వేసింది దీపిక . దానికి తగ్గట్టే దీపిక-సందీప్ కూడా రియాక్ట్ అయ్యారు. " నాకు కొన్ని నీతి నియమాలు ఉన్నాయి " అంటూ పరోక్షకంగానే తన ఇంటర్వ్యూ కి సంబంధించిన క్లిప్స్ షేర్ చేసింది . ఇలాంటి మూమెంట్లోనే కొన్ని ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తున్నాయి.
మరీ ముఖ్యంగా దీపిక పదుకొనే ఇలా మాట్లాడింది అంటూ స్క్రీన్ షాట్లు సందీప్ రెడ్డివంగా అలా అడిగాడు అంటూ స్క్రీన్ షాట్ లు రకరకాలుగా వైరల్ అవుతున్నాయి . ఇలాంటి మూమెంట్లోని దీపికా పదుకొనే అనే పేరుతో ఒక స్క్రీన్ షాట్ బాగా వైరల్ గా మారింది . "సందీప్ రెడ్డివంగా నన్ను ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటింపజేయాలని చూసారు అని .. ఆ సినిమాలో ప్రభాస్ తో లిప్ లాక్ సీన్లో నటించమన్నారు అని.. ఆ సిచువేషన్ ఎలాంటిదో విన్న తర్వాత నాకు నాకే అసహ్యం అనిపించింది అని .. ఆ తర్వాత నేను ఆ సీన్స్ చేయడానికి ఒప్పుకోలేదు అని.. సినిమా రిజెక్ట్ చేశాను అని దీపిక పదుకొనే ఆ స్క్రీన్ షాట్ లో రాసుకోచ్చినట్లు ట్రెండ్ అవుతుంది".
అయితే సందీప్ రెడ్డివంగా వర్షెన్ మాత్రం దానికి వేరేలా ఉంది . ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన కారణంగానే ఆమెను సినిమాలో నుంచి తీసేసారు అని.. 30 - 40 కోట్ల ఫీజు తో పాటు కొన్ని ఏరియాలో ప్రాఫిట్స్ షేర్ అడగడం అదేవిధంగా.. కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల సినిమాలోంచి తీసేసాం అనే విధంగా సందీప్ రెడ్డివంగా కు సంబంధించిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు . అసలు నిజానిజాలు ఏంటి అనేది వాళ్లకే తెలియాలి . మరొక పక్క కొంతమంది సందీప్ రెడ్డివంగా కమిట్మెంట్ అడిగాడేమో..? పక్కలో పడుకోవడం ఇష్టం లేకనే ఆ కారణంగానే దీపికా రిజెక్ట్ చేసి ఉంటుంది అని అంటుంటే .. మరి కొందరైతే అలాంటప్పుడు తృప్తి అందుకు ఒప్పుకున్నిందా..? అందుకే హీరోయిన్గా పెట్టుకున్నారా..? అంటూ రకరకాలుగా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి తాను చేయని తప్పుకు సందీప్ రెడ్డి వంగా అలా అందరి చేత మాటలు పడాల్సి వస్తుంది. సందీప్ బోఓల్డ్ సినిమాలు తెరకెక్కించాడే కానీ ఎప్పుడు హీరోయిన్స్ ని ఇబ్బంది పెట్టలేదు..వల్గర్ గా తచ్ చేయలేదు. కానీ ఈసారీ ఈ బాలీవుడ్ బ్యూటీ కారణంగా బాగా మాటలు పడుతున్నాడు అంటున్నారు ఆయన ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఇప్పుడు తృప్తి- దీపికా-సందీప్ రెడ్డివంగా పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . అయితే ఇంత జరుగుతున్నా ప్రభాస్ తన సినిమా గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం..!