తాజాగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులీ పొందిన వారి లిస్ట్ బయట పెట్టిన సంగతి మనకు తెలిసిందే. 2024 లో బెస్ట్ సినిమా, బెస్ట్ యాక్టర్,బెస్ట్ హీరోయిన్ ఇలా అందరి లిస్టు బయట పెట్టింది. ఇందులో భాగంగా బెస్ట్ యాక్టర్ అవార్డు పుష్ప -2 లోని నటనకు గాను మళ్ళీ అల్లు అర్జున్ అందుకున్నారు.అలాగే ఉత్తమ సినిమాగా కల్కి 2898 AD, ఉత్తమ డైరెక్టర్ గా కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ఉత్తమ హీరోయిన్ గా 35 ఇది కథ కాదు లో నటించిన నివేదా థామస్ వంటి వారికి అవార్డులు వచ్చాయి. అయితే గద్దర్ అవార్డులు వచ్చిన వేళ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ చిరంజీవి వంటి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై అలాగే అవార్డులు వచ్చిన వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ఇందులో భాగంగా ఇండస్ట్రీకి పెద్దన్న చెప్పుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో గద్దర్ అవార్డులు వచ్చిన వారిపై ట్వీట్ పెట్టారు. అయితే ఇందులో చిరంజీవి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గద్దర్ అవార్డులు అందుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇండస్ట్రీలోని నటినటులు, టెక్నీషియన్స్, డైరెక్టర్లు అందరి శ్రమను గుర్తించి ఈ అవార్డులు ఇవ్వడం ఎంతో ఆనందదాయకం అంటూ ట్వీట్ పెట్టారు. అయితే ఈ ట్వీట్ లో మరోసారి మెగా అల్లు వివాదం రాజుకుంది. ఎందుకంటే చిరంజీవి తన ట్వీట్ లో అల్లు అర్జున్ ని మెన్షన్ చేయలేదు. అయితే ఎవరిని మెన్షన్ చేయకపోయినప్పటికీ కనీసం వారందరినీ మెన్షన్ చేసి ట్విట్ చేయాలి కదా..

అల్లు అర్జున్ కి అవార్డు వచ్చినందుకే చిరంజీవి పేర్లు మెన్షన్ చేయలేదని, ఒకవేళ అల్లు అర్జున్ కాకుండా వేరే ఏ హీరోకి వచ్చినా కూడా చిరంజీవి వారి పేరు మెన్షన్ చేసే వారిని సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్ చిరంజీవి ట్వీట్ కింద కామెంట్లు పెడుతున్నారు.అంతేకాదు అల్లు అర్జున్ మీద చిరంజీవికి కుళ్ళు పెరిగిపోతుందని, తన కొడుక్కి రాకుండా అల్లు అర్జున్ కి ఈ అవార్డులు రావడంతో ఆయన సహించలేకపోతున్నారంటూ అల్లు అర్జున్ అభిమానులు నెట్టింట్లో కామెంట్ల మోత మోగిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ పేరు మెన్షన్ చేయకపోవడంతో మరోసారి అల్లు మెగా వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: