డైరెక్టర్ శంకర్ అంటే కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా సుపరిచితుడు.అలాంటిది శంకర్ కూతుర్లనే మహేష్ బాబు అవమానించారట. మరి ఇంతకీ మహేష్ బాబు శంకర్ కూతుర్లని ఎందుకు అవమానించారు అనేది ఇప్పుడు చూద్దాం.. శంకర్ కి ఇద్దరు కూతుర్లు.. అందులో ఒకరు అతిధి మరొకరు ఐశ్వర్య.. అయితే ఈ ఇద్దరు ఓసారి తండ్రితో సినిమా షూటింగ్ కోసం వెళ్లి ఆకలేస్తుందని ఓ రెస్టారెంట్ దగ్గర ఆగారట. అయితే అక్కడే మహేష్ బాబు కూడా తన ఫ్యామిలీతో రెస్టారెంట్ కి వచ్చారట.మహేష్ బాబు ని చూసి ఆయన వీరాభిమానులు అయినటువంటి అధితి, ఐశ్వర్య ఇద్దరు పరిగెత్తుకు వెళ్లి ఒక సెల్ఫీ ఇవ్వండి అని అడిగారట. దానికి మహేష్ బాబు నేను మీకు సెల్ఫీ ఇవ్వలేను.

 ఫ్యామిలీతో ఉన్నాను అని చెప్పారట.దాంతో అదితి, ఐశ్వర్య ఇద్దరు సారీ సార్ డిస్ట్రబ్ చేసినందుకు అని అక్కడి నుండి వచ్చేసారట. కానీ ఆ తర్వాత మెహర్ రమేష్ వచ్చి సార్ వాళ్ళిద్దరూ ఎవరనుకుంటున్నారు..డైరెక్టర్ శంకర్ కూతుర్లు అని చెప్పారట. దాంతో తప్పు తెలుసుకున్న మహేష్ బాబు శంకర్ దగ్గరికి వెళ్లి సారీ సార్ మీ కూతుర్లని నాకు తెలియదు. తెలియక అలా చేశాను అని అన్నారట.ఇక మహేష్ బాబు మాటలకి శంకర్ కూడా మీరెందుకు సారీ చెబుతున్నారు.. హీరో అంటే మీలాగే ఉండాలి.సెల్ఫీలు అడగడంతోనే ఎవరు ఇవ్వరు కదా.. మీరు హీరోలాగే నడుచుకున్నారు .ఇందులో మీ తప్పేమీ లేదు అన్నారట. 

ఆ తర్వాత మహేష్ బాబు శంకర్ ఇద్దరు కూతుళ్ళకి సెల్ఫీ ఇచ్చారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు బాలకృష్ణ హోస్ట్ గా చేసే అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చారు. అయితే ఇదే విషయాన్ని తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్ కూతురు అధితి శంకర్ కూడా చెప్పింది. ఆరోజు మేము ఎవరమో తెలియక మహేష్ బాబు గారు సెల్ఫీ ఇవ్వలేదు.ఆ తర్వాత మా గురించి తెలిసి నాన్న దగ్గరికి వచ్చి స్వయంగా సారీ చెప్పి మాకు సెల్ఫీ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అదితి శంకర్ చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: