
ఈ క్రమంలోనే రాజేంద్రప్రసాద్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్షణం నుంచి తన ఆఖరి శ్వాస వరకు ఇకపై ఎవరిని కూడా తనకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడను అంటూ తెలియజేశారు.. తాను చదువుతో చాలా సరదాగా అన్న మాటలు.. ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.. తాను ప్రేమతోనే అన్నానంటు ఆలీ కూడా వివరణ ఇచ్చారు.. అంత మటుకు బంధాలు లేకపోతే తాను ఇన్నేళ్లు యాక్టర్ గా ఎలా ఉంటాను అయితే ఇప్పుడు మాత్రం తాను చాలా బాధపడ్డాను అంటూ తెలిపారు.
ఇక జీవితంలో ఎప్పుడూ ఎవరిని ఇక దురుసుగా మాట్లాడను.. ఇక తాను కూడా సీనియర్ ఎన్టీఆర్ లాగే చిన్న వారిని కూడా నువ్వు అనేవారు కాదు.. మీరు అనేవారు ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు కూడా అలాగే మర్యాదగా మాట్లాడతానంటూ తెలియజేశారు.. అయితే ఇంకో రకంగా ఎప్పుడు మాట్లాడను నేను మాట్లాడిన వారందరూ కూడా ఇప్పటివరకు తన ఫ్యామిలీ మెంబర్స్ అంటూ తెలియజేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే ఫంక్షన్ లో జరిగిన వీడియోని ఫుల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది.. తాను ఎందుకు మాట్లాడానో తెలుస్తుంది.చిన్నచిన్న క్లిప్పులను చూస్తే ఎవరికీ అర్థం కాదు అంటూ తెలిపారు.