నిన్న బెంగళూరులో జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట అందరి హృదయాల్ని పిండేస్తుంది , ఆ విజువల్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కామన్ పీపుల్స్ . అయితే సరిగ్గా ఇదే విధంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా సమయంలోనే జరిగింది . మనందరికీ ఆ ఇన్సిడెంట్ గుర్తుండే ఉంటుంది.  అల్లు అర్జున్ - అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ ఇన్సిడెంట్ ఎప్పటికి మర్చిపోలేరు . ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ కారణంగానే అల్లు అర్జున్ ఒకరోజు రాత్రంతా జైల్లో గడపాల్సి వచ్చింది . అల్లు అర్జున్ లైఫ్ కి అది బిగ్ రిమార్క్ గా మారిపోయింది .


ఈ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కరెక్టు టైం లో కరెక్టు పాయింట్ లేవదీశారు . పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాని మొదటి రోజే చూడాలి అన్న ఆనందం దక్కించుకోవాలి అంటూ కొంతమంది ఫ్యాన్స్ ప్రీమియర్ షో కోసం ఫ్యాన్స్ షో కోసం సినిమా చూడడానికి ఎగబడ్డారు . మరి ముఖ్యంగా సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ సినిమా చూడడానికి వస్తున్నాడు అని తెలిసి అక్కడ ఇంకా ఫ్యాన్స్ ఎక్కువగా గుమ్మ గుడారు . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చూసేందుకు జనాభా ఎగబడిపోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది .



రేవతి అనే మహిళ అక్కడికి అక్కడే మృతి చెందింది . ఆమె కొడుకు బాగా తీవ్రంగా గాయపడ్డారు.  అయితే ఈ ఘటన జరగడానికి పూర్తి కారణం అల్లు అర్జున్ నేమని.. అల్లు అర్జున్ అసలు తన మానవత్వాన్ని పక్కనపెట్టి మనిషి చనిపోయింది అని తెలిసినా కూడా సినిమా చూశాడు అని అప్పట్లో రచ్చ రంబోలా చేసి పెద్ద రాద్ధాంతంగా మార్చేశారు. అల్లు అర్జున్ పై కేసు ఫైల్ చేసి ఆయనను జైలుకు వెళ్లేలా చేశారు . అయితే సేమ్ టు సేమ్ అదే సీన్ మళ్ళీ రిపీట్ అయింది.  ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు గెలిచింది. ఈ ఆనందాన్ని బెంగళూరు స్టేట్ మొత్తం ఓ పండగల సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చింది. ఇదే మూమెంట్లో నిన్న చిన్న  స్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది . ఆర్ సి బి మెంబర్స్ ని చూడడానికి ఐపీఎల్ కప్ ని చూడడానికి తమ ఆనందాన్ని ఆర్సిబి వాళ్ళతో పంచుకోవడానికి వేలాదిమంది జనాలు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు .



ఈ క్రమంలోనే అక్కడ జన సంద్రోహాన్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు.  అక్కడ తొక్కిసలాట జరిగింది . 11 మంది ప్రాణాలు కోల్పోయారు . వందకు మందికి పైగా గాయాలు పాలయ్యారు . తీవ్రంగా గాయాలు పాలైన వారు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.  అయితే పుష్ప 2 విషయంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కలాట జరిగింది అని.. దానికి పూర్తి కారణం అల్లు అర్జున్ అని.. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది గా తెలంగాణ గవర్నమెంట్ . ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఆర్సిబి మెంబర్స్ ని అరెస్ట్ చేస్తుందా? వాల కారణంగానే ఇక్కడ తొక్కిసలాట జరిగింది . వాళ్ళు అసలు బెంగళూరుకి రాకుండా ఉంటే ఐపీఎల్ ట్రోఫీని ఇక్కడికి తీసుకు రాకుండా ఉండి ఉంటే ఇలాంటి పరేడ్  నిర్వహించకుండా ముందుగానే ప్లాన్ చేసుకొని ఉంటే 11 మంది ప్రాణాలతో ఉండేవాళ్ళుగా.  ఒక్క ప్రాణం పోయినందుకు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు . ఇప్పుడు 11 మంది ప్రాణాలు పోయాయి 11 మంది ఆర్సీబీ మెంబర్స్ ని అరెస్ట్ చేస్తారా ..?అంటూ జనాలు ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు . కొంతమంది బన్నీ ఫ్యాన్స్ కూడా దీన్ని ఘాటుగా సపోర్ట్ చేస్తున్నారు . తప్పు ఎవ్వరి విషయంలో జరిగిన అది తప్పే . అల్లు అర్జున్ వల్ల రేవతి ప్రాణం పోయింది అన్న మాట నిజమైతే ఆర్సీబీ మెంబర్స్ వల్ల ఇప్పుడు ఆ 11 మంది చనిపోయారు . మరి ఆ 11 మందిని అరెస్టు చేస్తారా ..? అంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

rcb