
ఇప్పుడు "ఘాటీ" సినిమాతో మరొకసారి తన పెర్ఫార్మన్స్ చూపించడానికి సిద్ధంగా ఉంది అనుష్క శెట్టి . కెరియర్లో చాలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ లో నటించింది . మరీ ముఖ్యంగా ఒక స్టార్ హీరోయిన్ ఇలాంటి రోల్ లో నటించడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయేలా చేసిన మూవీ "వేదం". ఈ సినిమాలో అనుష్క సరోజ పాత్రలో అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించింది. జూన్ 4వ తేదీకి ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "వేదం" సినిమాకు సంబంధించి కొన్ని స్పెషల్ పోస్టర్ లు కూడా పెట్టారు . ఈ సినిమా ద్వార అనుష్క కి బనీకి ఎంత పేరు వచ్చిందో అంతే క్రేజ్ సంపాదించుకుంది అనుష్క.
కాగా ఇదే మూమెంట్లో అనుష్క శెట్టి కి సంబంధించిన మరి కొన్ని వార్తలు కూడా ట్రెండింగ్ లోకి వచ్చాయ్. మరీ ముఖ్యంగా అప్పట్లో అనుష్క అనటించిన "బలాదూర్" సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో రవితేజాకి పోటా పోటీగా నటించి మెప్పించింది హీరోయిన్ అనుష్క. అయితే ఈ సినిమా షూటింగ్ టైం లో అనుష్క ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నింది. ఈ సినిమా షూట్ చేస్తున్న మూమెంట్ లో పడవ లో ఓ సీన్ షూట్ చేస్తున్నప్పుడు అనుష్క పొరపాటున రవితేజ కి డూప్ గా నటిస్తున్న వ్యక్తిని తోసేసింది. అది అంతా సీన్ లో భాగమే. అయితే అనుకోకుండా రవితేజ్ డూప్ మరణించారు. ఆ టైంలో అనుష్క పై పోలీస్ కేసు పెట్టిన్నట్లు వాళ్ల కుటుంబ సభ్యులు వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆ తరువాత చిత్ర బృందం ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసుని బయటకి రాకుండా జాగ్రత్త పడ్డారట. ఆ తరువాత అనుష్క కూడా డబ్బులిచ్చి ఆ కుటుంబాని కూల్ చేసింది అంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి ఇదే విషయాని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆకతాయిలు..!
