కేవలం మూడు రోజులే మూడంటే మూడు రోజులే . మరో మూడు రోజుల్లో నందమూరి అభిమానులకి ఒక పెద్ద పండగ లాంటి రోజు . దానికి కారణం నందమూరి నటసింహం బాలయ్య పుట్టినరోజు . ఈరోజు నందమూరి అభిమానులు ఎంత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు అనేదాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. కాగా బాలయ్య పుట్టినరోజు అంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు . ఓ రేంజ్ లో కటౌట్లు.. కేక్ కటింగ్ లు.. లాంటివి చేస్తూ ఉంటారు.


అంతేకాదు ఆయన కమిట్ అయిన నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు . పెద్ద పెద్ద హీరోలు ..పాన్  ఇండియా హీరోలు కూడా పుట్టినరోజు నాడు అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ఫ్లాప్ అవుతూ ఉండొచ్చు . కానీ నందమూరి బాలయ్య మాత్రం ప్రతిసారి ఆ  విషయంలో సూపర్ సక్సెస్ అవుతూనే ఉంటాడు . మొదటి నుంచే నందమూరి అభిమానులకి ఏం కావాలి అనే దాని గురించి ఆలోచించి తన బర్త్డ డే కి పర్ఫెక్ట్ ట్రీట్ ని ప్లాన్ చేస్తాడు . ఈ బర్త్ డే కి కూడా అంతే.



క్రిష్ డైరెక్షన్ లో ఆదిత్య 999  సినిమా నుంచి తన కొడుకు మోక్షజ్ఞ పోస్టర్ ని సినిమా అనౌన్స్మెంట్ ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నారట.  ఇది నిజంగా నందమూరి అభిమానులకి వెరీ బిగ్ సర్ప్రైజింగ్ అని చెప్పాలి.  అయితే ఇదే రోజున ఆయన రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో నటించబోతున్న విషయాన్ని కూడా అఫీషియల్ పోస్టర్ ద్వారా ప్రకటించబోతున్నారట . జైలర్ 2 సినిమాలో బాలయ్య నటించబోతున్నాడు అంటూ ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది.  ఈ సినిమాలో నటించినందుకు గాను ఆయన కూడా హై రెమ్యూనరేషన్ ఛార్క్ చేశారు అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది .



అయితే ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉంటుంది ..? రజినీకాంత్ కి అపోజిషన్ నా..? రజనీకాంత్ కి ఫేవర్ గా ఉండే క్యారెక్టర్ నా..? అని రకరకాల డౌట్లు ఎప్పటినుంచో అభిమానులకు వస్తూనే ఉన్నాయి. అవ్వంతా పటాపంచలు చేస్తూ బాలయ్య తన పుట్టినరోజు నాడు బిగ్ సర్ప్రైజ్ చేస్తూ జైలర్ 2 సినిమాకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ని అఫీషియల్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రకటించబోతున్నారట . ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులకు రెండు బడా బిగ్ సర్ప్రైజ్లు రాబోతున్నాయి.  దీనికోసం నందమూరి ఫ్యాన్స్ ఈగరుగా వెయిట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: