నందమూరి హీరోలైన బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్ విభిన్నమైన సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. బాలయ్య, తారక్ ఖాతాలో వరుస విజయాలు చేరుతుండగా కళ్యాణ్ రామ్ మాత్రం ఒక హిట్ సాధిస్తే తర్వాత రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్ కాంబోలో మూవీ సాధ్యమేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
 
అయితే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం మరీ కష్టం కాదని బాలయ్య జోక్యం చేసుకుంటే అద్భుతమైన కథ సిద్ధం చేయడానికి టాలీవుడ్ దర్శకులు సిద్ధంగానే ఉన్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ స్థానంలో బాలయ్య నటించి ఉంటే బాగుండేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
మరోవైపు బాలయ్య సైతం జైలర్2 సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. కేవలం 10 నిమిషాల రోల్ కోసం బాలయ్య 22 కోట్ల రూపాయలు తీసుకున్నారని తెలుస్తోంది. నిమిషానికి 2.2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే సాధారణ విషయం అయితే కాదని చెప్పవచ్చు.
 
64 సంవత్సరాల వయస్సులో సైతం బాలయ్య రికార్డులు క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలయ్య వయస్సు పెరుగుతున్నా సింపుల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. బాలయ్య పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు కాగా లక్ష్మీ నరసింహ సినిమా రీరిలీజ్ కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. బాలయ్య సినిమాలు రీరిలీజ్ లో సైతం సంచలనాలు సృష్టిస్తున్నాయి.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: