టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య అందరివాడుగా గుర్తింపును సొంతం చేసుకుంటారు. ఇండస్ట్రీలో ఎవరైనా సహాయం కోరితే ఆ సహాయం చేయడానికి బాలయ్య వెనుకాడరని చెప్పవచ్చు. స్టార్ యాంకర్ ఉదయభాను బాలయ్య బాబూ దేవుడిగా భావిస్తారు. ఒకానొక సందర్భంలో ఉదయభాను ఎమోషనల్ అవుతూ బాలయ్య బాబు గొప్పదనం గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
 
ఒక ఆడపిల్లగా నా లైఫ్ లో ఎలాంటి సరదాలు లేవని ఉదయభాను అన్నారు. అయితే నావాళ్లు అందరూ నాకు దూరం కావడం నాకు దేవునిపై నమ్మకం కోల్పోయేలా చేసిందని ఉదయభాను చెప్పుకొచ్చారు. కానీ మళ్లీ ఆ దేవుడే ఒకరు కాక ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడని ఉదయభాను అభిప్రాయం వ్యక్తం చేశారు. నా లైఫ్ లో మొదటి పండుగ వాళ్లిద్దరి పుట్టినరోజు అని ఉదయభాను కామెంట్లు చేశారు.
 
నేను నాకు తెలిసిన వాళ్లందరికీ మెసేజ్ చేశానని వాళ్లెవరూ రెస్పాండ్ కాలేదని ఆయన తెలిపారు. బాలయ్య గారికి పుట్టినరోజని మెసేజ్ చేయగా ఆయన కాల్ బ్యాక్ చేశారని ఉదయభాను కామెంట్లు చేశారు. నేను చెప్పినరోజున బాలయ్యకు అనంతపురంలో మీటింగ్ ఉన్నా రాత్రి ట్రావెల్ చేసి పుట్టినరోజుకు వచ్చారని దాదాపుగా 45 నిమిషాలు బాలయ్య అందరితో ఫోటోలు దిగారని ఉదయభాను కామెంట్లు చేశారు.
 
హ్యాట్సాఫ్ బాలయ్య జై బాలయ్య అంటూ ఉదయభాను కామెంట్లు చేశారు. ఒక షోలో భాగంగా ఉదయభాను చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బాలయ్య గొప్పదనం గురించి ఈ విధంగా ఇండస్ట్రీలో ఎన్నో కథలున్నాయి. బాలయ్యను ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సైతం ఎంతగానో అభిమానిస్తారు. బాలయ్య క్రేజ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. బాలయ్య ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్న అంగతి తెలిసిందే. బాలయ్యను ఇండస్ట్రీలోని యంగ్ హీరోలు సైతం ఎంతగానో అభిమానిస్తారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: