టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖా వాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమాల్లో అభినయ ప్రధాన పాత్రల్లో కనిపించడానికి ప్రాధాన్యత ఇచ్చిన సురేఖా వాణి రియల్ లైఫ్ లో మాత్రం గ్లామరస్ గా కనిపించడానికి ఇష్టపడతారు. సోషల్ మీడియాలో సైతం ఈమె యాక్టివ్ గా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తాజాగా సురేఖా వాణి  టాటూ వేయించుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.  సురేఖా వాణీ  తనకనెంతో ఇష్టమైన ఏడు  కొండల స్వామి  పాదుకలను కుడి చేతిపై  పచ్చబొట్టుగా వేయించుకున్నారు. అలాగే గోవిందా నామాలను కూడా వేయించుకున్నారు. స్వామివారిపై ఉన్న భక్తితో ఆమె ఈ విధంగా చేయడం జరిగింది.  ఇందుకు సంబంధించిన వీడియోను సురేఖ వాణి  ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

ముందు నా పెదబాబు నడుస్తాడు ఆయన వెనుక నేను నడుస్తాను  గోవిందా గోవిందా అంటూ సురేఖ క్యాప్షన్ రాసుకొచ్చారు.  ఇది చూసిన కొందరు ఆమె భక్తిని ప్రశంసిస్తుండగా మరి కొందరు మాత్రం  ఆమె ఓవరాక్షన్ చేస్తోందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.  అయితే స్వామివారు అంటే నమ్మకం ఉండటం వల్లే ఆమె టాటూ వేయించుకున్నారని  సమాచారం అందుతోంది.  గతంలో సురేఖా వాణి తిరుమలలో తలనీలాలు సమర్పించిన సంగతి  తెలిసిందే.

వెండితెరపై నటిగా రాణించిన సురేఖ వణికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్  అంతా ఇంతా కాదు. కారణం  తెలీదు కానీ  ఈ మధ్య కాలంలో సురేఖ వాణికి ఎక్కువ సంఖ్యలో  ఆఫర్లు అయితే రావడం లేదు.  సురేఖ వాణి కూతురు సుప్రీత త్వరలో సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండగా  సుప్రీత సినిమాల్లో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.  సురేఖ వాణి సైతం కెరీర్ పరంగా మరిన్ని  విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: