స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ కంటే మనుషులకు ఎక్కువ విలువ ఇస్తారనే సంగతి తెలిసిందే. పవన్ హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధంగా ఉండగా ఓజీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలతో పాటు పవన్ మరో సినిమాకు ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.  గతంలో సముద్రఖని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.  ఆ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిని రీచ్ కాలేదు. అయినప్పటికీ  సముద్రఖనిపై ఉన్న నమ్మకంతో  పవన్ కళ్యాణ్ ఈ దర్శకునికి మరో ఛాన్స్ ఇచ్చారని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్  కెరీర్ ప్లాన్స్ విషయంలో  ఫ్యాన్స్ మాత్రం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందరు హీరోలు  పాన్ ఇండియా, పాన్  వరల్డ్  డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తుండగా పవన్ మాత్రం భిన్నంగా అడుగులు వేస్తుండటం గమనార్హం. రామ్ చరణ్ తో పవన్ ఒక సినిమాను నిర్మించే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.  పవన్ పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.

పవన్ కొత్త సినిమాను  ప్రకటిస్తే ఆ సినిమా ఏ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతుందనే చర్చ సైతం జరుగుతోంది.  పవన్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమా ఫిక్స్ కాగా వేర్వేరు కారణాల వల్ల  ఆ సినిమా ఆగిపోయింది.  ఈ సినిమా మళ్ళీ  పట్టాలెక్కుతుందా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. భవిష్యత్తు ప్రాజెక్ట్స్ విషయంలో పవన్  మనసులో ఏముందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: