
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున . . . కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ , పాపులర్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో నటిస్తుండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా ? అని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కు చెందిన ప్రొడక్షన్ హౌస్ వేపారర్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంది. దీంతో ఈ సినిమాకు కేరళలో మరింత క్రేజ్ రావడం ఖాయం అని సౌత్ ఇండియన్ సినీ ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.
ఈ సినిమా ట్రైలర్ ను జూన్ 14న రిలీజ్ చేస్తుండడంతో ఈ సినిమా పై హైప్ మరింత పెరగటం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా శేఖర్ కమ్ముల ఓ అదిరిపోయే విజువల్ ట్రీట్ ప్రేక్షకులకు అందిస్తారన్న అంచనాలు కుబేరపై ఇప్పటికే పెరిగి పోయాయి. ఈ సినిమాను
నైజాం లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కం ఎగ్జిబిటర్ అయిన ఆసియన్ సునీల్ - రామ్మోహన్ రావు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా . . . జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు