
అలాంటి వాళ్ళందరికీ నోరులు మూయించే విధంగా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ రికార్డ్ ఎలా క్రియేట్ చేశాడో అందరికి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ కారణం వెంకటేష్ కామిడీ టైమింగ్ అనే చెప్పాలి . అయితే "సంక్రాంతికి వస్తున్నాం" లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత వెంకటేష్ ఏ సినిమాలు అంత ఈజీగా ఒప్పుకోలేదట . దాదాపు ఆయన ఈ గ్యాప్ లో 25 పైగా సినిమాల కథల రిజెక్ట్ చేసారట . వెంకటేష్ కెరియర్ లోనే ఇలా ఒక సినిమా తర్వాత సుమారు 25 సినిమా కథలు విని రిజెక్ట్ చేయడం ఫస్ట్ టైం .
అయితే అన్నీ కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలే..హిట్ అయ్యే సినిమాలే అంట. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే. కానీ వెంకటేష్ కి మాత్రం సరికొత్తగా డిఫరెంట్ గా ట్రై చేయాలి అనిపించిందట . ఆ కారణంగానే అన్ని కధలు రిజెక్ట్ చేశారట . కాగా ప్రసెంట్ విక్టరీ వెంకటేష్ -త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమాలోను స్పెషల్ క్యారెక్టర్ లో మెరవబోతున్నారట. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు..!!