ఏంటి ఒక మంత్రి కూతురు ఓ హీరోతో దాదాపు 20 రోజులు గడిపిందా..ఇది నిజమేనా.. లేక ఇండస్ట్రీలో కామన్ గా వినిపించే రూమరా అని చాలామంది అనుకుంటారు.. కానీ ఇది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరో భార్యనే బయట పెట్టింది. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది చూస్తే ఆయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందా.. ఒకప్పుడు వరుస సినిమాలతో బాలీవుడ్ ని శాసించిన హీరోలలో గోవింద కూడా ఒకరు. ఈయన తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే అలాంటి గోవిందాని ఓ మంత్రి కూతురు చాలా ఇష్టపడిందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా గోవింద భార్య సునీత అహుజా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.సునీత ఆహుజా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. మొదట మా ఇంట్లోకి ఓ అమ్మాయి పనిమనిషిగా ప్రవేశించింది.

 కానీ ఆ అమ్మాయి ప్రవర్తన చూస్తే పనిమనిషిగా ఏ కోణాన కూడా కనిపించలేదు.ఆమె చూస్తే గొప్పింటి అమ్మాయిలాగా కనిపించింది. కానీ మా ఇంట్లోకి పనిమనిషి అవతారం ఎత్తి వచ్చింది. ఇక మా ఆయనని తెల్లవార్లు చూస్తూ కూర్చుండేది. ఆయనని చూసే అవకాశం వస్తే అస్సలు మిస్ చేసుకునేది కాదు. రాత్రింబవళ్లు ఆయనని చూస్తూ గడిపేసేది. ఆయన అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం.  అయితే ఆ తర్వాతే ఆమె పనిమనిషి కాదు ఓ మంత్రి కూతురు అనే విషయం బయటపడింది. ఇక మా ఆయన మీద ఉన్న ఇష్టం ప్రేమతోనే ఆమె పని మనిషిగా మా ఇంట్లోకి వచ్చి నా భర్తకి దగ్గర అయింది.

 ఆ తర్వాత ఆమె ప్రవర్తన చూసి గట్టిగా మందలించేసరికి ఆ అమ్మాయి ఏడుస్తూ నేను పనిమనిషిని కాదు గోవిందా అంటే నాకు చాలా ఇష్టం. నేను ఓ మంత్రి కూతురిని అనే విషయం బయట పెట్టింది. ఇక ఆమె మాతో పాటు 20 రోజులు గడిపింది. కేవలం నా భర్త మీద ఉన్న ఇష్టంతోనే ఆయనకు దగ్గరగా ఉండాలని పనిమనిషి అవతారం ఎత్తింది.ఇక ఈ విషయం తెలిసాక ఆ మంత్రి గారు నాలుగు కార్లతో మా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. అంటూ సునీత ఆహుజా ఓ పాడ్ కాస్ట్ లో ఈ విషయాన్ని బయట పెట్టింది  ఇక ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారడంతో గోవింద మీద అంత పిచ్చి ప్రేమ ఉన్న ఆ మంత్రి కూతురు ఎవరబ్బా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: