పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నిధి అగర్వాల్ హీరోయిన్గా హరిహర వీరమల్లు అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలు అయింది. ఈ సినిమా చాలా డిలే అవుతూ రావడంతో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు నుండి క్రష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను జ్యోతి కృష్ణ అనే దర్శకుడు పూర్తి చేశాడు. ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది.

కానీ ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన సమయంలో ఈ మూవీ కి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి అని , ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయడం లేదు అని , మరో కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం అని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యి ఇప్పటికే చాలా రోజులే అవుతున్న ఈ మూవీ కొత్త విడుదల తేదీని మాత్రం మేకర్స్ ఇప్పటి వరకు ప్రకటించడం లేదు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ తో చర్చలు జరుపుతున్నట్లు , ఆ చర్చలు ఓ కొలెక్కి రాకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్మెంట్ లేట్ అవుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఏదేమైనా కూడా పవన్ అభిమానులు మాత్రం హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... ఏ ఏం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: