ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే .. బన్నీ కెరియర్ లోని 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమా పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి .. కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన సన్ పిక్చర్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుంది .. అలాగే దీపికా పాడుకొనే మృణాల్‌ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారు .. అయితే ఈ భారీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని ఇంట్రెస్ట్ అందరిలో నెలకొంది .. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. అనిరుధ్ , సాయి అబ్యాంక‌ర్‌ పేరులు గత కొన్ని  నెలలుగా వినిపిస్తున్నాయి .. కానీ ఎవరిని ఓకే చేయలేదు మేకర్స్ ..
 

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ అట్లీ సినిమాకు కోలీవుడ్ యంగ్ మ్యూజిక్స్ సెన్సేషన్ సాయి అబ్యాంక‌ర్‌ను ఫిక్స్ చేశారని అంటున్నారు .. ఇక త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారట చిత్ర యూనిట్ .. కోలీవుడ్ లో ఇప్పుడు సాయి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు .. ఇప్పటికే సూర్య నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా కరుప్పు తో పాటు లోకేష్ కనగ‌రాజ్‌ నిర్మిస్తున్న బెంజ్, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాల కు మ్యూజిక్ అందిస్తున్నారు .. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ , అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాకు కూడా ఈ యువ సంచలనం ఓకే అవటం మానోడి క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది .. అతి చిన్న వయసులోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ఓకే చేసిన ఈ యంగ్ స్టార్ రాబోయే రోజుల్లో ఎటువంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: