ఈ మధ్య కాలంలో కొంతమంది స్టార్ హీరోస్ ఎలాంటి పాత్రల్లోనైనా సరే నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . గతంలో మాత్రం హీరో అంటే హీరో గానే చేసే వాళ్ళు . మిగతా రోల్స్ లో నటించమన్న పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు . కానీ ఇప్పుడు మాత్రం ఒక్కొక్క హీరో  ఆ లిమిట్స్ క్రాస్ చేస్తూ పక్క హీరో సినిమాలో విలన్ గా అయినా స్పెషల్ క్యారెక్టర్ లో అయిన మెరుస్తున్నారు. తాజాగా "కుబేర" సినిమాలో నాగార్జున చేసిన పాత్ర ఎంత హైలెట్గా మారింది అనేది అందరికీ తెలిసిందే . అదే విధంగా ప్రభాస్ "కన్నప్ప" సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో మెరిసి సినిమా రిజల్ట్ నే మార్చేశాడు.


ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన మరొక వార్త హైలెట్ గా మారింది . హీరో ప్రభాస్ ఇంకో సినిమాలో గెస్ట్ పాత్రలో నటించబోతున్నారట . అది కూడా పాన్ ఇండియా సినిమానే కావడం గమనార్హం.  డైరెక్టర్ ఈ విధంగా మొత్తం పాన్ ఇండియా మయం కాబోతుంది అంటూ జనాలు నాటిగా కామెంట్స్ చేస్తున్నారు . ఇంతకీ ప్రభాస్ గెస్ట్ పాత్రలో కనిపించిపోయే సినిమా ఏంటో తెలుసా..?? "డ్రాగన్".. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే సినిమా . ఆల్రెడీ ప్రశాంత్ నీల్ కి ప్రభాస్ ఎంత జాన్ జిగిడి దోస్త్ ఉంది అనేది అందరికీ తెలుసు .



ఇక ఎన్టీఆర్ - ప్రభాస్ అంటారా..?? పిచ్చ పిచ్చ ఫ్యాన్స్ . ఒకరికి ఒకరు బాగా హెల్ప్ చేసుకుంటారు మాట్లాడుకుంటారు.  వీళ్ళ కాంబోలో సినిమా అంటే మాత్రం రచ్చ రంబోలానే.  ఆల్రెడీ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ "సల్లార్"  సినిమా వచ్చింది . సల్లార్  2 కూడా సెట్స్ పైకి వచ్చేస్తుంది . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే  సినిమాలో ప్రభాస్ ని గెస్ట్ పాత్రలో చూపించడానికి సర్వం సిద్ధం చేశాడట ప్రశాంత్ నీల్.  తెరపై కనిపించేది కేవలం ఐదు నిమిషాలు పాత్రే అయినా చాలా నాటిగా ఫన్నీగా ఉంటుంది అని .. బుజ్జిగాడు సినిమా స్టైల్ లో ప్రభాస్ ఈ క్యారెక్టర్ లో కనిపిస్తాడు అని.. తెర పైకి ఓ న్యూస్ వచ్చింది . దీంతో  సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది . చూద్దాం మరి ప్రభాస్ ఈ క్యారెక్టర్ లో ఎలా మెప్పిస్తాడో....????

మరింత సమాచారం తెలుసుకోండి: