గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గేమ్ చెంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం చరణ్ "పెద్ది" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తుండగా ... బుచ్చిబాబు సనామూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శివ రాజ్ కుమార్ , జగపతి బాబు కీలక పాత్రలలో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన గ్లీమ్స్ వీడియోని విడుదల చేసింది. ఆ గ్లీమ్స్ వీడియో అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఒక్క సారిగా ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోయాయి. ఈ మూవీ గ్లీమ్స్ వీడియోతో పాటు ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సంవత్సరం మార్చి వరకు ఈ సినిమాకు సంబంధించిన 30% షూటింగ్ పూర్తి అయినట్లు వార్తలు వచ్చాయి. దానితో మిగిలిన 70% షూటింగ్ ను పోస్ట్ ప్రొడక్షన్ పనులను చాలా స్పీడ్ గా పూర్తి చేస్తేనే ఈ మూవీ వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీ వరకు విడుదల అవుతుంది అని చాలా మంది భావించారు. ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 55 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ మార్చి 27 వ తేదీన ఖచ్చితంగా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీ పై చరణ్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: