- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి విజ‌యం అందుకుందో చూశాం. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు బాబి డైరెక్ట్ చేయ‌గా .. పూర్తి యాక్ష‌న్ డ్రామా గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకంది. ఈ సినిమా లో బాల‌య్య న‌ట విశ్వ‌రూపం చూపించారు. అఖండ త‌ర్వాత బాల‌య్య ఖాతాలో వ‌రుస‌గా నాలుగో హిట్ సినిమా గా డాకూ మ‌హారాజ్ నిలిచింది. థ‌మ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం అయితే ఈ సినిమాకు మేజ‌ర్ హైలైట్‌గా నిలిచింది.


ఇక ఇప్పుడు డాకూ మ‌హారాజ్ సినిమా బుల్లితెరపై తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. స్టార్ మా ఛానెల్ లో  ‘ డాకు మహారాజ్ ’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్‌కు అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా ను ఈ నెల 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేస్తున్నట్లు స్టార్ మా ప్రకటించింది. ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో లేదో బాల‌య్య అభిమానులు మ‌రోసారి డాకూ మ‌హారాజ్ ను బుల్లి తెర‌పై చూసి ఎంజాయ్ చేసేందుకు రెడీ గా ఉన్నారు.
డాకూ మ‌హారాజ్‌ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: