
ఆ తర్వాత లవ్ ,బ్రేకప్ వంటి విషయాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు పలు రకాల ఫోటోలను షేర్ చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ తన సినీ ప్రయాణం ఒక కీలకంగా మారింది అంటూ వెల్లడించింది. సినీ ఇండస్ట్రీలో గ్లామర్ గా కనిపించిన వాస్తవంగా చాలా ఒత్తిడిలు బాగోద్వేగాలతో కూడి ఉంటుందంటూ వెల్లడించింది. దేవదాసు సినిమా సమయంలో తాను ఎదుర్కొన్న కష్టం ఎప్పటికీ మర్చిపోలేనట్టు వెల్లడించింది ఇలియానా.
తన మొదటి సినిమా కావడం వల్ల సినిమా షూటింగ్ సెట్ లో కొత్త వాతావరణ అలాగే భాష, వర్క్ కల్చర్ అన్నీ కూడా చాలా ఒత్తిడి గురైలా చేశాయి.. దీంతో తన తల్లికి ఫోన్ చేసి మరి సినిమా వదిలేస్తానని చెప్పాను అంతే కాకుండా ఏడ్చేసానని.. ఆ సమయంలో తల్లి ధైర్యం చెప్పడం వల్లే ఆ చిత్రాన్ని పూర్తి చేశానని.. ఈ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది అంటూ తెలిపింది ఇలియానా. ఆ సినిమానే తనని స్టార్ గా నిలబెట్టేలా చేసిందని ఒత్తిడిలో నుంచి ధైర్యంగా ముందుకు వెళ్లడం చాలా అవసరము అందుకు మన కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉండడం చాలా ముఖ్యమని తెలిపింది ఇలియానా. ఇలియానా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.