
అందాల భామ శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. జయాపజయాలు పక్కన పెడితే శ్రీలీల చేతిలో ఇప్పటికీ ఆరడజనులకు పైగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలీల నటిస్తున్న సినిమాలలో జూనియర్ ఒకటి. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలికిరీటి ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం ఇస్తున్న ఈ సినిమాలో కిరీటి సరసన శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుండగా .. బొమ్మరిల్లు భామ జెనీలియా చాలా యేళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. జూనియర్ సినిమా జూలై 18 రిలీజ్ కు రెడీ అవుతుంది.
స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రీ లీల సినిమా చేయటం ఏంటని అందరూ షాక్ అయ్యారు. అయితే ఈ సినిమా కథ నచ్చడంతో పాటు రెమ్యూనరేషన్ రెట్టింపు ఇవ్వడంతో ఆమె జూనియర్ సినిమాలో హీరోయిన్గా చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. జూనియర్ సినిమాకు ఈ చిన్నది అక్షరాల నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ అందుకుందని టాక్ నడుస్తోంది. శ్రీలీల ఇప్పటి వరకు రెండు కోట్లు మాత్రమే డిమాండ్ చేస్తూ వచ్చింది. ఇక ఈ సినిమా కోసం మరో రెండు కోట్లు అదనంగా అందుతుందని సమాచారం. ఏది ఏమైనా రెమ్యూనరేషన్ డబుల్ చేయడంతో శ్రీలీల కుర్ర హీరోలతో అయినా నటించేందుకు రెడీగా ఉందని జూనియర్ సినిమాతో టాలీవుడ్కు క్లారిటీ వచ్చేసింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు