
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నైజాం ఏరియాలో ప్రీమియర్‌లకు సిద్ధమవుతోంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మొగల్ సామ్రాజ్యం కాలం నాటి కథాంశంతో వస్తుండటం, పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్‌లో కనిపించనుండటం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమవుతోంది.
చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేశాయి. నైజాం ప్రాంతంలో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ బుకింగ్స్ ఒకింత ఆలస్యంగా మొదలయ్యాయనే సంగతి తెలిసిందే.
ప్రీమియర్స్ బుకింగ్స్ ఆలస్యం వెనుక మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ తెలివైన స్ట్రాటజీ ఉందని తెలుస్తోంది. మొదట 24వ తేదీ టికెట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొనిరావడం ద్వారా ఫస్ట్ డే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ప్రీమియర్స్ కు బుక్ చేసుకునే వాళ్ళు ఎలాగో బుక్ చేసుకుంటారని ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు సైతం ప్రీమియర్స్ కోసం టికెట్లు బుకింగ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
ప్రీమియర్ షోల టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని, ఇప్పటికే చాలా చోట్ల టిక్కెట్లు దొరకడం లేదని సమాచారం అందుతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను పెద్ద హిట్‌గా నిలపడటానికి తమ వంతు కృషి చేస్తున్నారు.