
రష్మిక మందన్నా ఫుల్ స్వింగ్ మీద ఉంది . జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది . మరో మూడేళ్ళు కాల్ షీట్స్ మొత్తం ఫిల్ అయిపోయాయి . ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది . అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ మాత్రం మిస్ చేసుకునింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ ఎన్ని పాన్ ఇండియా మూవీస్ లో వర్క్ చేస్తున్నారో అందరికీ తెలుసు. ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నాడు . అలాగే వార్ 2 సినిమాని కూడా ప్రమోట్ చేస్తున్నారు . ఆ తర్వాత దేవర2 ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కే మురుగన్ సినిమాని సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు .
నిజానికి దేవర సినిమాలో ముందుగా హీరోయిన్ రష్మిక ని అనుకున్నారట కానీ కొన్ని కారణాలు చేత మేకర్స్ ఆమెను తప్పించారట. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ - కాంబోలో తెరకెక్కే సినిమాలో సెకండ్ హీరోయిన్ గ రష్మిక మందన్నా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపించాయి . అదంతా ఫేక్ అంటూ మూవీ టీం కొట్టి పడేసింది . ఆ ప్లేస్ లోకి మృణాల్ ఠాకూర్ వచ్చి చేరినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ మిస్ చేసుకునింది రష్మిక మందన్నా. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ "మురుగన్" సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో రష్మిక మందన్నాను అనుకున్నారట మూవీ మేకర్స్. కానీ రష్మిక మందన్నా కాల్ షీట్స్ అడ్జెస్ట్ అవ్వని కారణంగా ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట . అదృష్టం కలిసొచ్చినా సరే దరిద్రం రష్మికను వెంటాడుతుంది అందుకే ఆ ఆఫర్ మిస్ చేసుకుంది అంటున్నారు సినీ ప్రముఖులు. ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా మిస్ చేసుకుంటారా అంటూ మండిపడుతున్నారు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!