పవన్ జ్యోతికృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. సెకండాఫ్ ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధానంగా కారణమైంది. జ్యోతి కృష్ణ మాట్లాడుతూ నేను ఈ సినిమా ప్రారంభం నుంచి ఉన్నానని ఇప్పుడు సినిమా విడుదలైంది కాబట్టి దీని గురించి నేను వివరించవచ్చని ఆయన తెలిపారు. కోహినూర్ ప్రధాన అంశంగా సాగే కథను ఫన్ ఫిలిం గా రూపొందించాలని భావించారని ఈ సినిమాను మాయాబజార్ స్టైల్ లో తీయాలని క్రిష్ కలగన్నారని జ్యోతి కృష్ణ అన్నారు.

అలాగే ఈ సినిమాను ప్రారంభించామని మొదట ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశామని తర్వాత కరోనా వచ్చిందని మళ్లీ మరో యాక్షన్ సీక్వెన్స్ తీసిన తర్వాత సెకండ్ వేవ్ వచ్చిందని ఆ తర్వాత ఎన్నికలు జరగడంతో వరుసగా బ్రేక్స్ వచ్చాయని దర్శకుడు క్రిష్  ఏడాది వెయిట్ చేశారని ఆయన అంగీకరించిన ప్రాజెక్ట్స్ ఉండడంతో వైదొలిగారని ఆ తర్వాత ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తానని పవన్ కు చెప్పడంతో నువ్వే దర్శకత్వం వహించు అని పవన్ కోరారు అని జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చారు.

నేను మొదటి భాగం కథలో మార్పులు చేశానని క్రిష్ అనుకున్న కథ రెండో భాగంలో వస్తుందని ఆయన పేర్కొన్నారు. కోహినూర్ కోసం అసలేం జరిగిందో రెండో భాగంలో చూపించనున్నామని హరి హర వీరమల్లు సినిమాలో ఏకంగా 4399 సిజి షాట్స్ వాడమని వాటిలో కేవలం నాలుగు ఐదు సీజీ షాట్స్ బాగా రాలేదని వాటిని కూడా మార్చామని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్సినిమా ప్రచారంలో భాగంగా నేను చేసుకున్న అదృష్టమని సినిమా రిలీజ్ కు ముందు పది రోజులు నేను ఇంటికి కూడా వెళ్లకుండా ఆఫీసులోనే ఉన్నానని ఆయన కామెంట్ చేశారు.

సినిమా ఎంత బాగా వచ్చినా మైనస్ పాయింట్స్ చెబుతూనే ఉంటారని హరి హర వీరమల్లు మూవీ నిడివి ఎక్కువ అని ఎవరు చెప్పలేదని సినిమా బోర్ కొట్టిందని సెకండ్ హాఫ్ బాలేదని కూడా చెప్పలేదని కొన్ని సన్నివేశాల సిజి వర్క్ బాలేదని మాత్రమే చెప్పారని చిన్న సన్నివేశం బాలేకపోతే సినిమా మొత్తం బాలేదని అనలేం కదా అని జ్యోతి కృష్ణ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: