తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కావడానికి అంతా సిద్ధం అవుతూ వస్తుంది. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కు సంబంధించిన పలు ప్రోమోలను బిగ్ బాస్ బృందం వారు విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిపై అనేక వార్తలు బయటకు వస్తున్నాయి.

ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో సామాన్యులకు కూడా అద్భుతమైన ప్రాధాన్యత ఉంటుంది అని అనేక వార్తలు బయటికి వస్తున్నాయి. ఆ వార్తలకు తగినట్లు గానే తాజాగా బిగ్ బాస్ బృందం ఓ ప్రోమోను విడుదల చేసింది. ఆ ప్రోమోలో దాదాపు 40 మందిని చూయించి ఇప్పటికి ఒక పని అయ్యింది. ఈ 40 మందిలో ఒకరిని ఫైనల్ గా సెట్ చేయాలి అనే తెలియజేస్తూ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రకారం వీరంతా మరి సామాన్యులు ఏమీ కాదు అని తెలుస్తుంది. వీరు ఎంతో కొంత సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారే అని తెలుస్తుంది. ఇందులో ఒక హీరోయిన్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు రేఖా భోజ్. ఈమెది వైజాగ్. 

బ్యూటీ  దామిని విల్లా , రంగేలా , కళ్యాణ తస్మై నమహ మరియు కొన్ని సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె నటించిన చాలా సినిమాల్లో తన అందాలను ఫుల్ గా ఆరబోసి యువతకు మంచి కిక్ ను ఎక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ బ్యూటీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బలంగా వార్తలు వస్తున్నాయి. మరి ఈమె బిగ్బాస్ 9 వ సీజన్లోకి ఎంట్రీ ఇస్తుందా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

rb