నిర్మాత నాగ వంశీ పేరుకే నిర్మాత కానీ పెద్ద వివాదాస్పదమైన నిర్మాత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన తన ప్రతి సినిమా విడుదలైన సమయంలో ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేసి వార్తల్లో నిలుస్తాడు.ఇప్పటికే ఆయన నిర్మించిన ఎన్నో సినిమాలు విడుదలైన సమయంలో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి వార్తల్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే కింగ్డమ్ విడుదల అయినా కూడా ఇంకా నాగ వంశీ నుండి కాంట్రవర్సీ కామెంట్ రాలేదు ఏంటి అని కొంతమంది ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులు తెరపడేలా కింగ్డమ్ థాంక్యూ మీట్లో కామెంట్ చేయనే చేశాడు.పవన్ కళ్యాణ్ కాదు మాకు ఆయనే పవన్ కళ్యాణ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పవర్ స్టార్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ పై నిర్మాత నాగవంశీ ఎందుకు అలాంటి కామెంట్లు చేశారు..ఏ హీరోని పవన్ కళ్యాణ్ తో సరిసమానంగా పోల్చారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇండస్ట్రీలో ఏ ట్యాగైనా సరే ఒక్క హీరోకే ఉండాలి అనుకుంటారు వాళ్ళ అభిమానులు.అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కరే ఉండాలి అంటారు. కానీ తాజాగా నిర్మాత నాగ వంశీ మాత్రం మాకు విజయ్ దేవరకొండ నే పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడిన మాటలు మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక విషయంలోకి వెళ్తే..జూలై 31న విడుదలైన కింగ్డమ్ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. ఈ సినిమాకి ముందు విడుదలైన ట్రీజర్, గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటి విజయ్ దేవరకొండకు పాజిటివ్ గానే వచ్చాయి.

అయితే చాలా రోజుల నుండి హిట్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండకు కింగ్డమ్ మూవీ తో ఎట్టకేలకు ఓ హిట్ ఆయన ఖాతాలో పడిపోయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి విడుదలయ్యాక సాయంత్రం థాంక్యూ మీట్ నిర్వహించారు. ఇందులో సక్సెస్ మీట్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు అని కొంతమంది మీడియా వాళ్ళు అడగగా.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో, ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో చేశాము. సక్సెస్ మీట్ ని ఏలూరు లేదా భీమవరంలో చేయాలి అనుకుంటున్నాము అంటూ నాగ వంశీ ఆన్సర్ ఇచ్చారు. అయితే నాగ వంశీ మాటలకు అక్కడున్న కొంతమంది ఏలూరు,భీమవరం అంటే పవన్ కళ్యాణ్ ని పిలుస్తున్నారా అని ప్రశ్నించగా..

లేదండి ప్రస్తుతం మాకు ఈయనే పవన్ కళ్యాణ్ అంటూ విజయ్ దేవరకొండ ను చూపిస్తూ పవన్ కళ్యాణ్ ను పిలవడం లేదండి అంటూ ఆన్సర్ ఇచ్చారు. అయితే నాగ వంశీ మాటలకు మీడియా సైతం ఆశ్చర్యపోయింది. ఇక ఈ విషయం బయటికి రాగానే పవర్ స్టార్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ స్థాయికి సరిసమానమా.. పవన్ కళ్యాణ్ ఎక్కడ విజయ్ దేవరకొండ ఎక్కడ.. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అనేవారు ఒక్కడే ఉండాలి . మరొకరిని పవన్ కళ్యాణ్ అన్న తో పోలిస్తే సహించేదే లేదు అంటూ పవర్స్టార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగవంశీ పై నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ నెగెటివిటీ గురించి నాగవంశీ స్పందిస్తారా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: