హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కింగ్డమ్. నిన్నటి రోజున భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలయ్యింది.డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. అయితే మొదటి రోజు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తాయని అభిమానులు అంచనా పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదటి రోజు 50% వరకు ఓపెనింగ్స్ రాబట్టాయని వినిపిస్తోంది. ట్రేడ్ నిపుణుల ప్రకారం కింగ్డమ్ సినిమా మొదటి రోజా రూ .30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా సమాచారం.


అంటే కింగ్డమ్ సినిమా మొదటి రోజు రూ.15.75 కోట్ల రూపాయలు  ఇండియాలో రాబట్టినట్లుగా సమాచారం. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ కెరియర్ లోనే ఇంతటి కలెక్షన్స్ రాబట్టిన చిత్రం లేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 18 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా వినిపిస్తున్నాయి. యూఎస్ఏ లో ఆల్రెడీ 1.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. అంటే సుమారు 8 కోట్ల రూపాయల వరకు యుఎస్ఏ లో కలెక్షన్స్ మొదటి రోజే రాబట్టింది. అయితే కలెక్షన్స్ కి సంబంధించి చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటన చేయవలసి ఉన్నది.



విజయ్ దేవరకొండ నటించిన గత చిత్రాల ఓపెనింగ్ విషయాలు వస్తే.. లైగర్ సినిమాకి రూ .23 కోట్లు గ్రాస్ రాగా.. ఖుషి చిత్రానికి 16 కోట్ల రూపాయలు.. ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో 30 కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ రాబడినట్లు వినిపిస్తోంది. మరి వీకెండ్ ముగిసే సమయానికి సుమారుగా ఈ సినిమా రూ .100 కోట్ల రూపాయలు గ్రాస్ రాబడతుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఏ మేరకు ఎన్ని కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ రాబడతాయో చూడాలి మరి. ఓటిటి డీల్ కూడా భారీ ధరకే అమ్ముడుపోయినట్లు  సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: