ఓ డైరెక్టర్‌ను బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌గా ముద్ర వేయడానికి ఒక్క విజయం సరిపోదు. అలానే ఓ మాస్ డైరెక్టర్‌గా చక్రం తిప్పాలంటే విజయాల పరంపర అవసరం. కానీ ప్రశాంత్ వర్మ విషయంలో ఇది కొంత భిన్నంగా జరిగింది. ‘ఆ!’, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’, ‘హను-మాన్’ లాంటి వైవిధ్యమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన ఈ దర్శకుడిపై తెలుగు సినిమా ప్రేక్షకులకు, పరిశ్రమకే ఒక విధమైన గౌరవం ఏర్పడింది. కొత్తదనానికి కేరాఫ్ అడ్రెస్, విజన్ ఉన్న డైరెక్టర్, సరికొత్త పంథా అంటూ ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఇప్పుడు అతడి పరిస్థితేంటి? అనేక ప్రాజెక్ట్లు ప్రకటించాక, ఒక్కదానికీ సరిగ్గా అప్‌డేట్ ఉండకపోవడం ఏంటని ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది.


‘హను-మాన్’ సినిమా తర్వాత, ప్రశాంత్ వరుసగా అనేక సినిమాలను అనౌన్స్ చేశాడు. ‘జై హనుమాన్’ పేరుతో రిషబ్ శెట్టి హీరోగా సినిమా అంటూ ప్రకటించగా, ఇప్పటిదాకా ఒక్క షూటింగ్ స్టిల్ బయటపడకపోవడం గమనార్హం. ‘అధీర’, ‘మహాకాళీ’, ‘బ్రహ్మ రాక్షస’, తమన్నా ‘దటీజ్ మహాలక్ష్మి’ ఇలా పేర్లు వినిపించినా, అవి ఎక్కడెక్కడ ఆగిపోయాయో ఎవరికీ తెలియని పరిస్థితే. మోక్షజ్ఞ సినిమాకు ముహూర్తం దగ్గరుండి లాక్‌అవుట్ కావడం, రన్‌వీర్ సింగ్ షూట్ చేసిన ‘బ్రహ్మ రాక్షస’ గల్లంతవడం, ప్రభాస్ ఎంట్రీకి సంబంధించి వార్తలు రావడం – ఇవన్నీ ప్రశాంత్ వర్మ మాస్ రేంజ్‌ని చూపించాయే కానీ, అవే ప్రాజెక్ట్లు కార్యరూపం దాల్చకపోవడం చుట్టూ అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. ఒక్కోసారి డైరెక్టర్ దృష్టి ఒకేసారి చాలా ప్రాజెక్ట్లపై ఉంటే, ఏదీ పూర్తికాలేక నిలిచిపోవచ్చు. లేక బిజినెస్ పరమైన సమస్యల వల్లే అయి ఉండవచ్చు.


అయితే ఇలాంటి కాంప్లికేటెడ్ ట్రాక్ చూస్తుంటే ప్రశాంత్ వర్మ డైలెమాలో ఉన్నారో? లేక ఫోకస్ తప్పిపోయిందో? అనే అనుమానం గట్టిగా వినిపిస్తోంది. సాధారణంగా ఒక దర్శకుడి విజన్‌ను పెట్టుబడిదారులు నమ్మినపుడు .. ఆ సినిమా సెట్‌పైకి వెళ్లడం ఖాయమవుతుంది. కానీ ప్రశాంత్ వర్మ దగ్గర ప్రాజెక్ట్‌లు ఎనౌన్స్ అయ్యాక ఏదీ జరగకపోవడం ఇక్క‌డ పెద్ద విశేషమే. విజన్ ఉన్నవాడు సరే కానీ .. ఆ విజన్‌ను గ్రౌండ్‌లో నిలబెట్టే ప్లానింగ్, ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. లేకపోతే గొప్ప డైరెక్టర్ అనే పేరు కూడా నిలవదు! ఇప్పుడు ప్రశాంత్ వర్మ దగ్గర బ్రిలియంట్ క్రియేటివిటీ ఉన్నా.. కంఫ్యూజన్ ట్రాక్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఫ్యాన్స్‌కు నిరాశే. ఇకపై ప్రశాంత్ వర్మ క్లారిటీతో ఒక్క ప్రాజెక్ట్‌ అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తేనే… అతడి ‘విశ్వవిరాట్ విజన్’కి న్యాయం జరుగుతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: