
ఆమధ్య వచ్చిన ‘కేజీ ఎఫ్’ మూవీ కూడ రెండు భాగాలుగా విడుదలై ఘనవిజయం సాధించడంతో టాప్ హీరోలతో సినిమాలు తీసే దర్శక నిర్మాతలు అందరూ తమ సినిమాలను రెండు భాగాలుగా తీసి భారీ లాభాలను రాబట్టుకోవాలి అని చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయా అన్న భావం కొంతమంది విశ్లేషకులకు కలుగుతోంది. ఈ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివల కాంబినేషన్ లో వచ్చిన ‘దేవర’ రెండు భాగాలుగా వస్తుందని ప్రచారం జరిగింది.
అయితే ఈమూవీ అనుకున్న స్థాయిలో విజయవంతం అవ్వకపోవడంతో ఇప్పుడు ‘దేవర 2’ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అన్న విషయం పై స్పష్టమైన క్లారిటీ దర్శకుడు కొరటాల శివకు కూడ లేదు అని అంటున్నారు. క్రితం వారం అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘హరి హర వీరమల్లు’ మూవీ కూడ రెండు భాగాలుగా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈమూవీ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడంతో ప్రస్తుతం పవన్ కు ఉన్న బిజీ రీత్యా ఈమూవీకి సీక్వెల్ తీయడం జరిగే పని కాదు అన్న సంకేతాలు వస్తున్నాయి.
ఇక లేటెస్ట్ గా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ మూవీని కూడ రెండు భాగాలుగా తీయాలని దర్శకుడు గౌతమ్ తిన్న నూరి ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈమూవీకి సీక్వెల్ ఉంటుందని నిర్మాత ఓపెన్ గా చెపుతున్నాడు. వాస్తవానికి సినిమా తొలి భాగాన్ని బాగా తీసి సరైన ముగింపు సస్పెన్స్ తో ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఆమూవీ సీక్వెల్ పై ఆశక్తి అందరిలో ఉంటుంది. అయితే సరైన కథ లేకుండా సినిమాను భారీ బడ్జెట్ తో తీసినా ప్రేక్షకులు పట్టించుకోరు అన్న విషయం ఇప్పటికైనా ఇండస్ట్రీ వర్గాలకు అర్థం అయి ఉంటుంది..