
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్ లో నిర్మించిన వార్ 2 సినిమా ఈ సినిమా ఈనెల రెండో వారంలో విడుదలకు రెడీ అవుతుంది. తెలుగు ధియేటర్ హక్కులు రు . 80 కోట్ల మేరకు అమ్మడు పోయాయి. ఇంత భారీ మొత్తం రికవరీ కావాలంటే సినిమాకు యునానమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. ఓపెనింగ్స్ బలంగా పడాలి. అదనపు రేట్లు ఎలాగూ తీసుకు వస్తారు. కానీ సినిమాకు అది సరిపోదు. పుష్ప 2 సినిమా నుంచి ఇటీవల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వరకు స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నారు. గతంలో బెనిఫిట్ షోలు అనేవారు. ఇప్పుడు ఏకంగా నిర్మాతనే అనుమతి తెచ్చి స్పెషల్ షో లు వేస్తున్నారు. దీనికి 500 కు పైగా రేట్లు పెడుతున్నారు. దీంతో మంచి ఓపెనింగ్ నెంబర్లు కనిపిస్తున్నాయి. వార్ 2 సినిమాకు కూడా స్పెషల్ రేట్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఏపీలో పెద్దగా సమస్య లేదు తెలంగాణలో కూడా తేవలసి ఉంటుంది. తెలంగాణలో అదనపు రేట్లు తెస్తేనే ప్రీమియర్లు ఉంటాయి. అలా లేకపోతే ఒక ఏపీలో మాత్రం స్పెషల్ ప్రీమియర్లు వేస్తారా అన్నది సందేహం. పైగా ఈ సినిమాకు పోటీగా కూలీ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. తెలుగు నాట మొత్తం 130 నుంచి 140 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలి వారు 2 సినిమా. అందువలన స్పెషల్ షో అన్నది చాలా కీలకం. మరి ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు