సత్యరాజ్ .. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ గా మాట్లాడి నానారకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు. చాలామంది హరిహర వీరమల్లు సినిమా నుంచి సత్యరాజ్ ను తీసేయాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. కానీ అప్పటికే ప్రింట్ రెడీ అయిపోవడంతో మేకర్స్ ఏం చేయలేక ఆయన సీన్స్ ని అలాగే ఉంచేశారు . ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు బాహుబలి సినిమాకి సంబంధించిన ఒక విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సన్స్డేషనల్ కామెంట్స్ చేశాడు సత్యరాజ్ . రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఒక చరిత్రను సృష్టించింది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు . అందులోని ప్రతి సీను ఒక ట్రెండ్ సెట్టర్.  మరీ ముఖ్యంగా ప్రభాస్ తో పాటు నటించిన మిగతా నటీనటులందరికీ కూడా ఇంపార్టెన్స్ దక్కింది .


అంతేకాదు ప్రభాస్ - సత్యరాజ్ తలపై కాలు పెట్టే సీన్ గూస్ బంప్స్ తెప్పించేస్తుంది . అయితే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది వయసులో అంత పెద్దాయన నెత్తిన కాలు పెట్టడం కరెక్టేనా ..?? అంటూ ట్రోల్ కూడా చేశారు . తాజాగా దీని గురించి సత్యరాజ్ మాట్లాడారు. "బాహుబలి కథ చెప్పడానికి రాజమౌళి మా ఇంటికి వచ్చారు. అప్పుడు నన్ను ఒక క్వశ్చన్ వేశారు . ఈ సినిమాలో ప్రభాస్ మీ తల మీద కాలు పెట్టాల్సి ఉంటుంది . అందుకు మీకు ఓకేనా..? అంటూ అడిగారు".



"అప్పుడు నేను ముందు కథ చెప్పండి కథలో ఇంపార్టెన్స్ ఉంటే కచ్చితంగా చేస్తాను అంటూ చెప్పాను . కథ చెప్పగానే ఇంప్రెస్ అయిపోయాను . కధ విన్నాక నాకు ఆ సీన్స్ ఉండాల్సిందే అనిపించింది.  ప్రతి మనిషికి ఈగో ఉంటుంది . అందులో నో డౌట్ . నాకు కూడా ఉంది . కానీ నా ఈగో నీ పక్కన పెట్టేసి ఆ సినిమాలో నటించాను. సెట్లో ఆ సీన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రభాస్ తెగ ఇబ్బంది పడిపోయాడు . నీ కాలు ఇవ్వు అన్నాను. దేనికి సార్ అంటూ కంగారు పడ్డారు .నీ కాలు నా తలపై పెట్టుకోవాలి . అది సీన్ అంటూ చెప్పాను.  షాక్ అయిపోయాడు . చాలా సందర్భాలలో మొహమాట పడేవాడు . చాలా హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న వ్యక్తి . ఆయన దగ్గర ఇలాంటి సీన్స్ చేయించడం నిజంగా రాజమౌళి పని తత్వం అని చెప్పాలి . కానీ ఆ సినిమా కోసం తప్పదు.  కాబట్టి చివరకు ప్రాక్టీస్ చేశాం.  ప్రభాస్ కూడా చాలా చాలా సపోర్టివ్ గానే ఈ సీన్స్ చేశారు . ప్రభాస్ మాట్లాడిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను "అంటూ బాహుబలి సినిమా నాటి షూటింగ్ విషయాలను గుర్తు చేసుకున్నాడు సత్యరాజ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: