
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే ఊసరవెల్లి, రామయ్యా వస్తావయ్యా సినిమాలు ఫస్టాఫ్ బాగున్నా సెకండాఫ్ విషయంలో పొరపాట్ల వల్ల ఆ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకునే విషయంలో ఫెయిల్ అయ్యాయి. దేవర సినిమాకు సంబంధించి మిడ్ నైట్ షోలు ప్రదర్శితం అయిన సమయంలో తారక్ ఖాతాలో ప్లాప్ చేరిందని చాలామంది గట్టిగా ఫిక్స్ అయ్యారు. రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ఎన్టీఆర్ కు సైతం సాధ్యం కాలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే దేవర విషయంలో మాత్రం లెక్కలు మారిపోయాయి. సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా క్లైమాక్స్ నిరాశ పరిచినా తారక్ అభిమానులు మాత్రం సినిమాను ఆశించిన దాని కంటే పెద్ద హిట్ చేశారు. ఈ ఒక్క విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పడంలో సందేహం అవసరం లేదు. వార్2 మూవీకి అబావ్ యావరేజ్ టాక్ వచ్చినా ఫ్యాన్స్ మాత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసే ఛాన్స్ అయితే ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 శాతానికి పైగా థియేటర్లలో వార్2 రిలీజ్ కానుంది. కేవలం 60 శాతం స్క్రీన్లలోనే వార్2 మూవీ రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకు షేర్ కలెక్షన్లు సైతం భారీ స్థాయిలోనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. నాగవంశీ వార్2 మూవీ హిట్ కావడానికి ఉన్న ఏ ఛాన్స్ వదులుకోవడం లేదు. మంచి నేమ్, ఫేమ్ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ చేస్తుండటం వార్2 సినిమాకు ప్లస్ అవుతోంది.