
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన వార్2 మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా విడుదలకు ముందే బుకింగ్స్ విషయంలో వార్2 తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు రికార్డ్ స్థాయి స్క్రీన్లలో నేడు వార్2 మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తారక్ కు ఏ స్థాయి విజయాన్ని అందించిందో ఇప్పుడు చూద్దాం.
కథ:
ప్రాణ స్నేహితులైన విక్రమ్ (జూనియర్ ఎన్టీఆర్), కబీర్ (హృతిక్ రోషన్) కొన్ని కారణాల వల్ల వేర్వేరు దారుల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే దేశం కోసం వాళ్లిద్దరూ ఏ విధంగా కనెక్ట్ అవుతారు? విక్రమ్ కబీర్ ను టార్గెట్ చేయడానికి కారణమేంటి? చివరకు వాళ్ళ లక్ష్యం నెరవేరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
వార్ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ డైరెక్టర్ కాగా ఆ సినిమా సక్సెస్ లో ఆయన పాత్ర ఎంత ఉందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అయాన్ ముఖర్జీ ఈ సినిమా విషయంలో పైపై మెరుగులు బాగానే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా ఇతర అంశాల విషయంలో నిరాశ పరిచారు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలను సద్వినియోగం చేసుకునే విషయంలో అయాన్ ముఖర్జీ పూర్తిస్థాయిలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.
ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా కథ, కథనంతో పాటు కమర్షియల్ గా సైతం మెప్పించింది. అయితే వార్2 సినిమా మాత్రం కమర్షియల్ గా అంచనాలను అందుకోవడం ఏ మాత్రం సాధ్యం కాదని చెప్పవచ్చు. నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై నమ్మకంతో 80 కోట్ల రూపాయలు రిస్క్ చేయగా ఈ మొత్తంలో ఎంతమేర రికవరీ అవుతుందో చూడాలి. సినిమాలో పాజిటివ్ అంశాలు ఉన్నప్పటికీ నెగిటివ్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పాత్ర విషయంలో సైతం దర్శకుడు ఒకింత గందరగోళానికి గురయ్యాడని చెప్పవచ్చు. ఒక మోస్తరు అంచనాలతో వెళ్తే పరవాలేదు కానీ భారీ అంచనాలతో వెళ్తే మాత్రం వార్2 ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు మాత్రం అస్సలు ఉండవని కచ్చితంగా చెప్పవచ్చు.
ఈ సినిమాను తెలుగులో కూడా తీశామని మేకర్స్ చెబుతున్నా తెరపై మాత్రం బాలీవుడ్ మూవీని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుతోంది. ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉన్నా ఎన్టీఆర్ పాత్రకు మరీ ఇన్ని వేరియేషన్స్ అవసరమా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. స్పై యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉన్నా అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా మెప్పించే ఛాన్స్ అయితే లేదని కచ్చితంగా చెప్పవచ్చు.
బలాలు ; హృతిక్, ఎన్టీఆర్, కొన్ని ట్విస్టులు, సెకండాఫ్
బలహీనతలు : ఫస్టాఫ్, సాంగ్స్, డైరెక్షన్,
రేటింగ్ : 2.75/5.0