- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తాజాగా, జిగ్రీస్ సినిమా నుండి వచ్చిన మొదటి పాట “తిరిగే భూమి” ను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేశారు. పాటను రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడుతూ ఆయన, “ఈ పాట చాలా ఎనర్జీటిక్‌గా ఉంది. కమ్రాన్ సయ్యద్ గారు ఇచ్చిన ట్యూన్ చాలా ఫ్రెష్‌గా ఉంది, లిరిక్స్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. టీజర్ నేను ముందే చూశాను, చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం నేను K Ramp సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా కూడా, షూటింగ్ స్పాట్‌కి పిలిపించి మరీ సమయం ఇచ్చి ఈ సినిమా గురించి మాట్లాడే అవకాశం ఇచ్చారు. నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే, అందుకే కొత్త వాళ్లంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. జిగ్రీస్ టీమ్ చాలా ప్యాషన్‌తో పనిచేశారు.


సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా. నా బెస్ట్ విషెస్ టు జిగ్రీస్ టీమ్” అని అన్నారు.
ఈ పాటను మ్యూజిక్ లేబుల్ టీ సీరిస్‌లో విడుదల చేశారు. టీజర్‌తో వచ్చిన బజ్‌కి తోడు, ఈ పాట కూడా యువతలో మంచి క్రేజ్ తెచ్చిపెడుతోంది. జిగ్రీస్ చిత్రంలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: