కేవలం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో కాకుండా, తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలబడాలని జాన్వీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే గ్లామర్ కన్నా కంటెంట్ ఉన్న పాత్రలను ఎక్కువగా ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. రీసెంట్ గా `పరమ్ సుందరి` మూవీతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. ఈ రొమాంటిక్ డ్రామాకు మిక్స్డ్ టాక్ లభించింది. అయితే పరమ్ సుందరి ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. తనకున్న కొన్ని వింత అలవాట్లను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
జాన్వీకి ఒక ప్రత్యేక అలవాటు ఉంది. ఎప్పుడూ ఇంట్లోకి అడుగుపెట్టినా ముందుగా కుడికాలు పెట్టడం తప్పనిసరి. ఇది శుభప్రదం అని తాను నమ్ముతానని జాన్వీ పేర్కొంది. అలాగే జాన్వీకి ఐస్‌క్రీమ్ అంటే పిచ్చి. ప్రతి రెండు గంటలకోసారి ఐస్‌క్రీమ్ తినాల్సిందే. అయితే ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇచ్చి షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్ తింటానని జాన్వీ తెలిపింది.
ఇక జాన్వీ కపూర్ కు రాత్రైతే నిద్రపోవడానికి ఎప్పుడూ తన పక్కన ఎవరో ఒకరు ఉండాలని భావిస్తుందట. ముఖ్యంగా తన చెల్లెలు ఖుషీ కపూర్ లేకుంటే నిద్ర పట్టదని చెబుతుంది. నిద్రపోతున్నప్పుడు జాన్వీ తన పాదాన్ని ఖుషీ పాదానికి తాకించి ఉంచడం ఒక అలవాటు. ఖుషీ లేకుంటే నిద్రపోవడం కష్టంగా అనిపిస్తుందని జాన్వీ చెప్పుకొచ్చింది. మొత్తానికి, జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, ఈ చిన్న చిన్న వింత అలవాట్లు ఆమెను మరింత క్యూట్‌గా, రియల్‌గా చూపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి