పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితమే హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవన్ చాలా కాలం తర్వాత రీమిక్ మూవీ లో కాకుండా కొత్త కథతో రూపొందిన సినిమాలో హీరో గా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ జూలై 24 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. పవన్ ప్రస్తుతం ఓజి అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. సుజత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటువంటి శ్రేయ రెడ్డి ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా శ్రీయ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె ఓజి మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శ్రేయ రెడ్డి "ఓజి" మూవీ గురించి మాట్లాడుతూ ... ఓజి సినిమాలో నా పాత్ర అద్భుతంగా ఉండబోతుంది. ఈ మూవీ లో నా పాత్ర చాలా రియలేస్టిక్ మరియు హార్డ్ హిట్టింగా ఉంటుంది. నా లుక్ మరియు పెర్ఫార్మన్స్ రెండింటిలోనూ ఈ మూవీ చాలా రియాల్టీ కి దగ్గరగా వచ్చినందుకు నేను ఎంతో సంతోష పడుతున్నాను అని శ్రేయ రెడ్డి తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇకపోతే సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: