ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. వారందరిలోకెళ్లా సుమ కాస్త టాప్ ప్లేస్ లో ఉంటుంది. పెద్దపెద్ద ప్రోగ్రాంలు ఏవైనా సరే సుమ కనకాల తన వాక్చాతుర్యంతో దూసుకెళ్తూ ఉంటుంది. అంతేకాదు పెద్ద పెద్ద స్టార్లు వచ్చినా కానీ ఆ ఈవెంట్లను చాలా అద్భుతంగా నడిపించగల శక్తి సుమ కు ఉందని చెప్పవచ్చు. అయితే సుమ ఇప్పటి ప్రజలందరికీ తెలుసు కానీ 2000లో యాంకరింగ్ అంటే చాలామందికి గుర్తుకువచ్చేది యాంకర్ ఉదయభాను పేరే. ఆమె మైకు పట్టిందంటే మాటలు మాట్లాడడమే కాదు యాక్టింగ్ లాగా చేస్తూ ఉర్రూతలూగించేది.. ఏ ప్రోగ్రామ్ అయినా సరే తనదైన శైలిలో  అద్భుతంగా చేసేది.  అయితే అలాంటి ఉదయభానుకి ఇండస్ట్రీలో అత్యంత ఇష్టమైన హీరో అంటే బాలకృష్ణ పేరు ముందుగా చెప్పేది. అయితే ఆమె బాలకృష్ణ పేరు చెప్పడం వల్ల ఒక్కోసారి చాలా ఇబ్బందులు ఎదుర్కొందట.. మరి అవి ఏంటి అనే వివరాలు చూద్దాం..

ఒక ఇంటర్వ్యూలో ఉదయభాను మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో యాంకర్లంతా సిండికేట్ అయిపోయారు.. మాలాంటి వారికి అవకాశాలు తక్కువగా వస్తున్నాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇండస్ట్రీలో ఒక హీరోని పొగిడితే మరో హీరో వర్గం వారు మనల్ని మరో కోణంలో చూస్తున్నారని అన్నది. నాకు బాలకృష్ణ అంటే ఎంతో ఇష్టం. కానీ మిగతా హీరోలు అంటే కోపం అని కాదు.. ఆయనకు నేను పెద్ద అభిమానిని నన్ను చాలా ఆప్యాయంగా చెల్లెమ్మా అంటూ పిలుస్తూ ఉంటారు. బాలయ్యను నేను సొంత అన్నయ్యలా ఫీలవుతాను. ఒక సమయంలో నా ఇద్దరు కూతుర్లతో నేను బాలకృష్ణ ఇంటికి వెళితే మా కోడళ్లు ఇంత పెద్దయ్యారా అంటూ ఆయన ఆప్యాయంగా పలకరించి వారిని దగ్గరికి తీసుకొని ఫోటో కూడా దిగారు. అలాంటి బాలయ్య గురించి  నేను పొగిడినట్టు మాట్లాడితే కొంతమంది హీరోల అభిమానులకు నచ్చడం లేదు. ఇక అప్పట్లో చిరంజీవి గారు  బంగీ జంప్ చేశారు..

అది సోషల్ మీడియాలో చాలా హైలెట్ అయింది. అదే జంప్ నేను చేస్తే కొంతమంది విమర్శించారు. కనీసం నేను చేసిన కష్టాన్ని వారు పట్టించుకోలేదు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఆ కంపౌండ్ ఈ కంపౌండ్ అంటూ కంపు కాంపౌండ్లు తయారయ్యాయి.. ఇండస్ట్రీలో ఉండే హీరోలకు ఎవరైనా అభిమానులు ఉంటారు. ఒక హీరోకు నేను అభిమాని అయితే మరో హీరో నాకు నచ్చకపోవడం అనేది దారుణం.. ఈ విధంగా ఎవరికి వారే కంపౌండ్ నిర్మించుకుంటే ఎలా అంటూ ప్రశ్నించింది.. ఈ కంపు కంపౌండ్ ల వల్ల మాలాంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని అన్నది. ఒక హీరోను పొగిడాము అంటే మరో హీరోని తిట్టినట్టు కాదు కదా అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఉదయభాను మెగా ఫ్యామిలీని ఉద్దేశించే ఇలా మాట్లాడిందని కొంతమందిని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: