సెప్టెంబర్ 5న తెలుగు సినిమా ప్రేక్షకులకు స్పెషల్ డే అని చెప్పాలి. ఈరోజు రెండు తెలుగు సినిమాలు మరియు ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. థియేటర్లలో సినిమాలు రీలీజ్ అవ్వగానే సోషల్ మీడియా రివ్యూలు, ఫస్ట్ డే టాక్స్, కలెక్షన్స్, పాజిటివ్-నెగటివ్ కామెంట్స్ అన్నీ హాట్ టాపిక్ అవుతాయి. ఈసారి కూడా అదే జరిగింది. ఈ మూడు సినిమాల్లో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంది? ఏది బాక్సాఫీస్ వద్ద కాస్త వెనకబడింది? ఆ వివరాలు ఒక్కొక్కటిగా చూద్దాం.


1. "ఘాటీ" :  డైరెక్టర్ కృష్ణ జాగర్లమూడి (క్రిష్) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈసారి ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. మనం ఇప్పటివరకు అనుష్కని ఎక్కువగా క్లాస్, సాఫ్ట్ పాత్రల్లో మాత్రమే చూసాం. కానీ ఈ సినిమాలో ఆమె మాస్ లుక్‌తో, యాక్షన్ షేడ్స్‌తో ప్రేక్షకులను షాక్ ఇచ్చింది. అనుష్కలోని వైలెంట్ యాంగిల్‌ని క్రిష్ బాగా ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు, అనుష్క నటన ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. అయితే కొన్ని చోట్ల ఎక్కువ వైలెన్స్ కారణంగా కొంత నెగిటివ్ టాక్ వినిపించినా, అది అనుష్క నటనపై కాదు, కేవలం సినిమా స్టైల్‌పై మాత్రమే అని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద "పర్వాలేదు" అనిపించే టాక్ సంపాదించుకుని, అనుష్క అభిమానులకు మంచి గిఫ్ట్‌గా నిలిచింది.



2. "లిటిల్ హార్ట్స్" :  పెద్ద ప్రమోషన్స్ లేకుండా, ఎటువంటి భారీ అంచనాలు లేకుండా సైలెంట్‌గా థియేటర్లలో విడుదలైన సినిమా లిటిల్ హార్ట్స్. ఈ సినిమా స్ట్రాంగ్ కంటెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. హాష్ ట్యాగ్ 90స్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కంటెంట్ క్రియేటర్ మౌళి హీరోగా నటించగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో మెప్పించిన శివాని హీరోయిన్‌గా కనిపించింది. యువత మనస్తత్వం, వారి ఆశలు, నేటి సొసైటీకి సంబంధించిన అంశాలను సింపుల్ కాన్సెప్ట్‌తో, ఎమోషనల్ హై ఎలివేషన్స్‌తో చూపించారు. సినిమా సాఫ్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు క్లీన్ మెసేజ్ ఇచ్చింది. ఫలితంగా లిటిల్ హార్ట్స్ సినిమా  మంచి పాజిటివ్ టాక్ సంపాదించి, బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలిచింది.



3. "మదరాశి" : తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన మదరాశి సినిమా తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బ్ చేసి విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సంపాదించింది.
శివకార్తికేయన్ యాక్టింగ్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి మెయిన్ హైలైట్ అయ్యాయి. అయితే మురుగదాస్ దర్శకత్వం పాత శైలిలోనే ఉందని, కథలో కొత్తదనం లేకపోవడంతో కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమాకి "ఫ్లాప్" అని ట్యాగ్ చేశారు. మరికొందరు మాత్రం యాక్షన్ సీక్వెన్సులు, మాస్ ఎలిమెంట్స్ బావున్నాయని పాజిటివ్‌గా రివ్యూ ఇచ్చారు. మొత్తానికి ఈ సినిమా “మిక్స్‌డ్ టాక్”తో సగం లాస్ సగం లాభం అనే స్థాయిలో నిలిచింది.


ఈ మూడు సినిమాల్లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినిమా "లిటిల్ హార్ట్స్" అని చెప్పక తప్పదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సింపుల్ స్టోరీతో, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో యంగ్ ఆడియన్స్‌నే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: