తెలుగు సినీ పరిశ్రమలో క్యూట్ కపుల్ గా పేరు పొందిన మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట గురించి చెప్పాల్సిన పనిలేదు. గడిచిన కొద్ది నెలల క్రితం లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. తాజాగా లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ఇద్దరు తల్లిదండ్రులైనట్లుగా తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.  ఈ విషయం తెలిసిన అభిమానులు వెంటనే మెగా కుటుంబంలోకి వారసుడు వచ్చారంటూ సంబరాలు చేసుకుంటున్నారు.


మరొకవైపు చిరంజీవి కూడా ఈ విషయం తెలిసిన వెంటనే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ సెట్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లి మరీ కొడుకు,కోడలికి శుభాకాంక్షలు తెలియజేశారు. వరుణ్ తేజ్ కి కొడుకు పుట్టడంతో మెగా ఇంట్లో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. దీంతో చాలామంది సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్  2017లో మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకొని..  2023 నవంబర్ 1 ఇటలీలోనీ టస్కనీ ప్రాంతంలో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్నారు.

మెగా అభిమానులు బేబీ అప్డేట్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. 2014లో ముకుంద సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కంచె సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఫిదా, తొలిప్రేమ, F2, గద్దల కొండ గణేష్, f3 తదితర సినిమాలలో నటించి మంచి విజయాలు అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో గత రెండేళ్ల నుంచి సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు వరుణ్ తేజ్.VT -15 పేరుతో డైరెక్టర్ మేర్లపాక గాంధీతో హర్రర్ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు వరుణ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: