
ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో కన్నడ హీరోని రంగంలోకి దింపేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.. ఆ హీరో ఎవరో కాదు కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి. డ్రాగన్ చిత్రంలో గెస్ట్ పాత్రలో కనిపించడానికి సిద్ధమైనట్లుగా కన్నడ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, రిషబ్ మధ్య మంచి స్నేహబంధం ఉన్నది. గతంలో కూడా వీరి ఇరువురి కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్స్, టెంపుల్స్ కూడా వెళ్లడం జరిగింది.
ఆ స్నేహబంధం వల్లే ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా ఎన్టీఆర్ చిత్రంలో గెస్ట్ పాత్రకి ఒప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇలా ఒప్పించడం వెనుక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని వచ్చే నెల రెండవ తేదీన రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంలో జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి ఎన్టీఆర్ చిత్రంలో గెస్ట్ రోల్ అనడంతో అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది.