ఏంటి తమన్నా నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా..ఆమె మాట్లాడిన మాటల వెనుక ఉన్న అర్థమేంటి..ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తమన్నా గుడ్ న్యూస్ చెప్పేసిందా..ఆ విధంగా హింట్ ఇచ్చిందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తమన్నా పెళ్లి చేసుకోవాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తమన్నాకి 35 సంవత్సరాల వయసు దాటింది. ఆమె ఏజ్ ఉన్న కొంతమంది హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఇంచుమించు ఒకేసారి వచ్చిన తమన్నా కాజల్, సమంత లలో కాజల్ వివాహం జరిగిపోయింది. సమంత కూడా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని మళ్ళీ రెండో పెళ్లికి రెడీ అయింది. కానీ తమన్నా మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. ఇక విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపించిన సమయంలో చాలామంది వీరి పెళ్లి త్వరలోనే జరగబోతుందని కలలు కన్నారు.

కానీ చివరికి తమన్నా విజయ్ వర్మలు విడిపోయారు. దాంతో అభిమానులు నిరాశ పడ్డారు. అయితే విజయ్ వర్మతో బ్రేకప్ అయినప్పటికీ ఆ బాధ ఎక్కడా కూడా కనిపించకుండా తమన్నా వరుస సినిమాలు చేస్తుంది. అయితే అలాంటి తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. నాకు కాబోయే వాడు నేను ఆయనకు భార్యగా వెళ్తే నా గురించి ఇలా ఫీల్ అవ్వాలి.. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అందుకే నాకు తమన్నా లాంటి మంచి భార్య దొరికింది అని మురిసిపోవాలి. ఒక మంచి భాగస్వామి అవ్వాలని నేను ప్రయత్నాలు చేస్తున్నాను.

అయితే ఇప్పటివరకు నన్ను చేసుకోబోయే ఆ లక్కీ పర్సన్ ఎవరు నాకైతే తెలియదు. ఏమో త్వరలోనే మీకు అతడు కనిపిస్తాడు కావచ్చు.. త్వరలోనే మీరు అతన్ని చూస్తారు కావచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.అయితే తమన్నా మాట్లాడిన మాటలు ఆమె ఎవరితోనైనా రిలేషన్ లో ఉందా అనే విధంగా అనుమానం వస్తుంది. ఎందుకంటే తమన్నా ఎవరితో రిలేషన్ లేకుంటే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అని మాట్లాడుకుంటున్నారు.మరి తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా.. అందుకే ఈ వ్యాఖ్యలు చేసిందా.. తమన్నాని పెళ్లి చేసుకోబోయే ఆ లక్కీ పర్సన్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు మోత మోగిస్తున్నారు. మరి చూడాలి తమన్నా ని పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరో

మరింత సమాచారం తెలుసుకోండి: