
సందీప్ రెడ్డి వంగా చెప్పే కథలు ఎప్పుడూ డేరింగ్‌గా, బోల్డ్‌గా, ఎమోషనల్‌గా ఉంటాయి. ఆయన తెరకెక్కించే సినిమాల్లో ఏ సీన్ అయినా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతారు. అలాంటి డైరెక్టర్ చేతిలో రొమాంటిక్ సీన్లకు సిగ్గుపడే ప్రభాస్ లాంటి స్టార్ హీరో నటిస్తే, ఆ కాంబినేషన్ ఎలాంటి స్థాయికి వెళ్లిపోతుందో ఊహించడం కూడా కష్టమే. అందుకే అభిమానులు “స్పిరిట్” సినిమా గురించి చాలా పెద్ద అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న "తృప్తి దిమ్రిని" సెలెక్ట్ చేశారు. తృప్తి, ప్రభాస్ జోడీ స్క్రీన్ మీద ఫ్రెష్‌గా, క్లాసీగా కనిపిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఖచ్చితంగా సంచలనాన్ని సృష్టిస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. “స్పిరిట్” సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా మరో స్టార్ హీరోయిన్‌ను ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. బీటౌన్ బ్యూటీ, ఆరడుగుల కటౌట్ ఉన్న మృణాల్ ఠాకూర్‌నే ఈ పాత్ర కోసం ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. మృణాల్ ఠాకూర్ గతంలో “సీతారామం” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ఆమె ప్రభాస్‌తో కలిసి నటించబోతున్నారన్న వార్త ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ప్రభాస్ పక్కన తృప్తి దిమ్రి, మృణాల్ ఠాకూర్ ఇద్దరు గ్లామరస్ బ్యూటీస్ స్క్రీన్ షేర్ చేయబోతుండటం నిజంగా స్పెషల్ ట్రీట్ అవుతుంది. ఈ కాంబినేషన్‌పై అభిమానులు, ట్రేడ్ వర్గాలు పెట్టుకున్న అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
సందీప్ రెడ్డి వంగా తన సినిమాల కోసం నటీనటులను సెలెక్ట్ చేసే విషయంలో ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడరు, కొత్తదనాన్ని వెతుకుతారు. ఈసారి కూడా ఆయన టేస్ట్‌తో ఈ కాస్టింగ్ డిసిషన్ “స్పిరిట్” సినిమాకి మరో లెవెల్ హైప్ తీసుకురాబోతోందని చెప్పవచ్చు. మొత్తానికి, రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ఇద్దరు సూపర్ టాలెంటెడ్ హీరోయిన్స్ రావడం వలన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధంగా ఉందని అందరూ భావిస్తున్నారు.