"సాయి పల్లవి".. ఈ పేరు వినగానే మనసుకు గుర్తొచ్చేది సహజమైన అందం, నేచురల్ యాక్టింగ్, డ్యాన్స్‌లో ఉన్న అద్భుతమైన నైపుణ్యం. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సాయి పల్లవి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. ఎలాంటి ఎక్స్పోజింగ్‌కి, లిమిట్స్ దాటే సీన్స్‌కి, వల్గారిటీ ఉన్న పాత్రలకు దూరంగా ఉంటూ, తనకు తానే కొన్ని రూల్స్ వేసుకుని వాటిని కఠినంగా ఫాలో అవుతుంది. ఈ డిఫరెంట్ స్టైల్‌ వల్ల ఆమెకు అభిమానులు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. కోలీవుడ్‌లో కూడా రెండు పెద్ద సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది. అయితే తెలుగులో చివరిసారి నటించిన ‘తండేల్’ సినిమా తర్వాత పెద్దగా కొత్త స్టోరీలు వినడానికి సాయి పల్లవి అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు సాయి పల్లవి మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ములతోనే మళ్లీ ఈ కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. ‘ఫిదా’ సినిమా ద్వారా సాయి పల్లవి టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ‘ఫిదా’లోని భానుమతి క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని, ఆమెకు అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకోవడం ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్‌ని క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరు అంటే... సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకునే నాని. ఇప్పటికే నాని, సాయి పల్లవి కాంబినేషన్‌లో ‘ఎంసీఏ’, ‘శ్యామ్ సింగర్ రాయ్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ జోడీకి టాలీవుడ్ ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ విజయవంతమైన జంటను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మళ్లీ చూడబోతున్నారన్న వార్త ఫ్యాన్స్‌కి డబుల్ హ్యాపీ న్యూస్.



వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. శేఖర్ కమ్ముల .. నానితో ఈ ప్రాజెక్ట్‌ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిపోయిందని, హీరోయిన్‌గా సాయి పల్లవిని రీసెంట్‌గా అఫీషియల్‌గా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల, నాని, సాయి పల్లవి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే అన్‌అఫీషియల్‌గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎందుకంటే శేఖర్ కమ్ముల సినిమాలకు ఉన్న ప్రత్యేకమైన రియలిస్టిక్ స్టైల్, నాని సహజమైన నటన, సాయి పల్లవి సహజ సౌందర్యం— అన్ని ఒక సెన్సేషన్ ప్రాజెక్ట్ రాబోతుందనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా లవర్స్ అందరూ ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: