పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరి హర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవన్ నటించిన సినిమా చాలా కాలం తర్వాత విడుదల కావడం తో ఆయన అభిమానులు ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ వారి అంచనాలను అందుకోలేక పోయింది. ఇక పవన్ తాజాగా ఓజి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పై ప్రేక్షకులు అత్యంత భారీ అచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. డి వీ వీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

అర్జున్ దాస్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రియ రెడ్డి ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కర్ణాటక ఏరియా థియేటర్ హక్కులను కూడా ఈ మూవీ యూనిట్ వారు అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క కర్ణాటక హక్కులను జేపిఆర్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ సంస్థ ఈ మూవీ యొక్క కర్ణాటక ఏరియా థియేటర్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక జెపిఆర్ ఫిలిమ్స్ సంస్థ వారు ఈ మూవీ ని కర్ణాటక ఏరియాలో చాలా పెద్ద ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk